బాలీవుడ్ లో మరో విషాదం, నటుడు సమీర్ ఖఖర్ మృతి, ప్రముఖుల సంతాపం

Published : Mar 15, 2023, 03:31 PM ISTUpdated : Mar 15, 2023, 03:33 PM IST
బాలీవుడ్ లో మరో విషాదం,  నటుడు సమీర్ ఖఖర్ మృతి,  ప్రముఖుల సంతాపం

సారాంశం

బాలీవుడ్ ను వరుస విషాదాలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటులు మరణించగా.. తాజాగా మరో బాలీవుడ్ నటుడు కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..నటుడు సమీర్ ఖఖర్ తిరిగిరానిలోకాలకువెళ్లిపోయారు. 

బాలీవుడ్ ను వరుస విషాదాలు కుదిపేస్తున్నాయి. ఒకరి తరువాత మరొకరు మరణిస్తు.. ఇండస్ట్రీకి షఆక్ ఇస్తున్నారు రీసెంట్ గా ప్రముఖ నటుడు, దర్శకుడు సతీష్ కౌశిక్ మరణించడంతో విషాదం నెలకొంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన మరణ వార్త నుంచి పరిశ్రమ ఇంకా తేలుకోకముందే బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది.ప్రముఖ నటుడు సమీర్ ఖఖర్ మరణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హిందీ పరిశ్రమలో మంచి పేరు సంపాధించుకున్న ఈ యాక్టర్.. అతి తక్కువ సినిమాలు చేసినా.. మంచి పేరు సంపాదించుకున్నారు. 

గత కొన్ని రోజులుగా ఆరోగ్య, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సమీర్ ఈరోజు తెల్లవారుజామున హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశాడు.  సమీర్ ఖఖర్ మరణంపై అతని సోదరుడు గణేష్ ఖఖర్ మీడియాకి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలో చాలా వరకు అవయవాలు ఫెయిల్ అయ్యాయి. హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూనే నేడు తెల్లవారు జామున కన్నుమూసినట్టుతెలిపారు.  సమీర్ మరణవార్త విని బాలీవుడ్ సెలబ్రిటీలు షాక్ కు గురయ్యారు. ఆయనతో నటించిన సినిమాలను గుర్తుచేసుకుంటూ పలువురు బాలీవుడ్ ప్రముఖులు అతనికి సంతాపం ప్రకటిస్తున్నారు. 

 

సమీర్ ఖఖర్ మరణంతో మరోసారి బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.1986 లో వచ్చిన నుక్కడ్ అనే టీవీ సిరీస్ తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న సమీర్ అనంతరం బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్, సినిమాల్లో నటించాడు. దాదాపు 50 కి పైగా సినిమాల్లో, 10 కి పైగా సీరియల్స్ లో సమీర్ నటించాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి