నటి భర్త హఠాన్మరణం... బాత్ రూమ్ లో విగతజీవిగా!

Published : Mar 25, 2023, 03:22 PM ISTUpdated : Mar 25, 2023, 03:25 PM IST
నటి భర్త హఠాన్మరణం... బాత్ రూమ్ లో విగతజీవిగా!

సారాంశం

బాలీవుడ్ నటి నీలు కోహ్లీ భర్త హర్మీందర్ సింగ్ కోహ్లీ హఠాన్మరణం పొందాడు. ఆయన బాత్రూమ్ లో విగతజీవిగా కనిపించారు.


సీనియర్ నటి నీలు కోహ్లీ జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త హర్మీందర్ సింగ్ కోహ్లీ ప్రమాదవశాత్తు మరణించారు. ఈ హఠాత్పరిణామానికి నీలు కోహ్లీ దిగ్భ్రాంతికి గురయ్యారు. శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆరోగ్యంగా ఉన్న హర్మీందర్ ఇలా కన్నుమూయడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకున్నారు. హరిద్వార దర్శించుకొని వచ్చిన హర్మీందర్ సింగ్ కోహ్లీ కాసేపటికి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 

హర్మీందర్ కోసం పనిమనిషి వంట సిద్ధం చేశారు. తన గదిలోకి వెళ్లిన హర్మీందర్ ఎంతకీ బయటకు రాలేదు. భోజనానికి ఆలస్యం అవుతుందని పని మనిషి ఆయన్ని పిలిచేందుకు రూమ్ లోకి వెళ్ళింది. అక్కడ లేకపోవడంతో ఓపెన్ గా ఉన్న బాత్ రూమ్ వైపు తొంగిచూసి ఆమె షాక్ అయ్యారు. హర్మీందర్ నేలపై పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

హర్మీందర్ మరణవార్త విన్న చిత్ర ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నీలు కోహ్లీకి తమ సానుభూతి తెలియజేస్తున్నారు. నీలు కోహ్లీ బాలీవుడ్ చిత్రాలతో పాటు పలు హిందీ సీరియల్స్ లో నటించారు. హౌస్ ఫుల్ 2, పాటియాలా హౌస్, హిందీ మీడియం వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల్లో భాగమయ్యారు. ఆదివారం హర్మీందర్ అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్