Mandana Karimi Comments : ఆ డైరెక్టర్ తో నాకే సంబంధం లేదు.. అసత్య ప్రచారాలపై నటి మందనా కరిమి మండిపాటు..

Published : Apr 21, 2022, 06:32 PM IST
Mandana Karimi Comments : ఆ డైరెక్టర్ తో నాకే సంబంధం లేదు.. అసత్య ప్రచారాలపై నటి మందనా కరిమి మండిపాటు..

సారాంశం

మోడల్, నటి మందనా కరిమి (Mandana Karimi)కి బాలీవుడ్ దర్శకుడికి మధ్య రిలేషన్ ఉందంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారాన్ని మందనా తాజాగా  ఖండించింది. ఈ సందర్భంగా అసత్య ప్రచారదారులపై మండిపడింది.   

ఇరాన్ కు చెందిన నటి, మోడల్ మందనా కరిమి నార్త్ ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. పలు టీవీ షోలు, సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ గ్లామర్ బ్యూటీ. హిందీలో ఆరేండ్ల కింద రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన చిత్రం ‘రాయ్’ చిత్రంలో గెస్ట్ రోల్  లో నటించింది.  ఆ తర్వాత బాగ్ జానీ చిత్రంలో లీడ్ రోడ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈ చిత్రం తదుపరి మరో రెండు మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీకి ఉన్నట్టుండి అవకాశాలు తగ్గాయి.  దీంతో టీవీ షోల వైపు మళ్లింది.  ఈ మేరకు బిగ్ బాస్ హిందీ 9లో కంటెస్టెంట్ గా టెలివిజన్ ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది.  ఈ చిత్రంలో సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఆ తర్వాత బిగ్ బాస్ 10లోనూ మెరిసింది. కానీ గెస్ట్ రోల్ కే పరిమితమైంది.  

ప్రస్తుతం ఎంఎక్స్ ప్లేయర్ మరియు ఏఎల్ టీ బాలాజీ ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో రన్ అవుతున్న ‘లాక్ అప్’ (Lock Upp) రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా కనిపించింది. ఈ రియాలిటీ షోకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షో నుంచి తాజాగా నటి మందనా కరిమి ఎలిమినేట్ అయ్యింది. అయితే లాక్ అప్ లో ఉన్నప్పుడు మందనా తన గురించి ఓ రహస్యాన్ని బయటపెట్టింది. 

తన భర్త నుంచి డివోర్స్ తీసుకున్నాక బాలీవుడ్ లోని ఓ ప్రముఖ దర్శకుడితో నాకు పరిచయం ఏర్పడిందని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రెగ్నెన్సీ రావడంతో ముఖం చాటేశాడని షోలో తెలిపింది. అయితే ఆ దర్శకుడు మరెవరో కాదు అనురాగ్ కశ్యప్ అంటూ కొందరు ప్రచారం చేయడం ప్రారంభించారు. తన కంట పడటంతో దీనిపై తాజాగా స్పందించింది మందనా. ‘అనురాగ్ నా ఫ్రెండ్. మేం మంచి స్నేహితులం. ఇలాంటి అసత్య ప్రచారాల్లో అతని పేరు చూసి బాధపడ్డాను. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం, నోటికొచ్చిన పేరు చెప్పి జీవితాలతో ఆడుకోవడం సరికాదు. ఇది చాలా బాధాకరం. నేను సహజీవనం చేసింది నా స్నేహితుడితో కాదు’ అంటూ ఫైర్ అయ్యింది.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌