Dosti Video Song: విజువల్ ట్రీట్ దోస్తీ ఫుల్ సాంగ్ వచ్చేసింది... ఎన్టీఆర్ చరణ్ లను చూడడానికి రెండు కళ్ళు చాలవు

Published : Apr 21, 2022, 04:54 PM ISTUpdated : Apr 21, 2022, 04:56 PM IST
Dosti Video Song: విజువల్ ట్రీట్ దోస్తీ ఫుల్ సాంగ్ వచ్చేసింది... ఎన్టీఆర్ చరణ్ లను చూడడానికి రెండు కళ్ళు చాలవు

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి వరుసగా వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుండి దోస్తీ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్, చరణ్ ల స్నేహ బంధాన్ని వివరిస్తూ తెరకెక్కిన దోస్తీ సాంగ్ వైరల్ గా మారింది.   

ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. దాదాపు నాలుగు వారాలుగా ఆర్ ఆర్ ఆర్ రన్ థియేటర్స్ లో కొనసాగుతుంది. కెజిఎఫ్ 2 విడుదలతో ఆర్ ఆర్ ఆర్ కలెక్షన్స్ నెమ్మదించాయి. అయినప్పటికీ కొన్ని ఏరియాల్లో ఈ మూవీ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబడుతుంది. సినిమా రన్ ముగుస్తుండగా హైప్ క్రియేట్ చేసేందుకు చిత్ర యూనిట్ వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్నారు. మొదటిగా నాటు నాటు సాంగ్ విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ కి ఫుల్ రెస్పాన్స్ దక్కింది. 

అనంతరం కొమ్మఉయ్యాల కోన జంపాల సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ సైతం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. పాట చివర్లో ఎన్టీఆర్ మల్లిని భుజాలపై ఎత్తుకొని తలకు పాగా ధరించి రావడం ఫాన్స్ కి మంచి అనుభూతి పంచింది. మూవీలో ఈ పాట పూర్తిగా లేదు. నేరుగా యూట్యూబ్ లో చూసిన ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యారు. కాగా ఏప్రిల్ 21న ఆర్ ఆర్ ఆర్ మూవీలోని అద్భుతమైన సాంగ్ దోస్తీ (Dosti Full Video Song)విడుదల చేశారు. 

బ్రిటీష్ కోటలో ఉన్న మల్లి కోసం వచ్చిన ఎన్టీఆర్(NTR), మల్లిని కాపాడడానికి వచ్చిన వ్యక్తి కోసం వెతుకుతున్న పోలీస్ అధికారి చరణ్ (Ram Charan)అనుకోకుండా కలుస్తారు. ఒకరికి మరొకరి నిజస్వరూపం తెలియని కారణంగా స్వచ్ఛమైన స్నేహం చేస్తారు. ఈ క్రమంలో తెరకెక్కించిన దోస్తీ సాంగ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాట నేపధ్యానికి తగ్గట్టుగా అద్భుతంగా రాశారు. కాలభైరవ పాడగా కీరవాణి సంగీతం అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దోస్తీ సాంగ్ విడుదలైంది. ఆర్ ఆర్ ఆర్ అభిమానులు మరోసారి ప్రశాంతగా ఆస్వాదిస్తున్నారు. 

ఇక వరల్డ్ వైడ్ గా ఆర్ ఆర్ ఆర్ దాదాపు రూ. 1100 కోట్ల కలెక్షన్స్ దాటివేసింది. బాలీవుడ్ లో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆర్ ఆర్ ఆర్ తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసింది. నైజాం లో ఆర్ ఆర్ ఆర్ రూ. 110 షేర్ వరకు రాబట్టడం కొత్త రికార్డు. మొత్తంగా రాజమౌళి (Rajamouli)తన లెగసీ కొనసాగిస్తూ ఆర్ ఆర్ ఆర్ రూపంలో భారీ హిట్ అందుకున్నారు.  

PREV
click me!

Recommended Stories

Chiranjeevi కెరీర్ లో టాప్ 5 గ్రాసర్స్..'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రానికి ఆ మూవీని బీట్ చేసే సత్తా ఉందా ?
చిరంజీవి తో మాజీ మిస్ వరల్డ్ రొమాన్స్.. మెగా 158 మూవీ కోసం ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? నిజమెంత?