
'చాలా బాగుంది' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన మాళవిక (Malavika)సూపర్ హిట్ అందుకుంది. దర్శకుడు ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ మూవీ విజయం సాధించింది. శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించారు. ఆ తర్వాత దీవించండి, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తో పాటు మరో రెండు చిత్రాలు చేశారు. మంచి ఆరంభం లభించినా మాళవిక తెలుగులో సక్సెస్ కాలేకపోయారు. అయితే తమిళంలో 35 చిత్రాలు చేశారు.
2007లో సుమేష్ మీనన్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2009 తర్వాత పూర్తిగా వెండితెరకు దూరం అయ్యారు. చాలా ఏళ్ల తర్వాత మాళవిక తెలుగు ప్రేక్షకులను పలకరించారు. పాప్యులర్ టాక్ షో ఆలీ తో సరదాగా ఈవెంట్ కి ఆమె అతిధిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చాలా బాగుంది మూవీ సమయంలో హీరో శ్రీకాంత్ తో గొడవైందని మాళవిక ఓపెన్ అయ్యారు.
ఓ సాంగ్ లో హీరో శ్రీకాంత్ (Srikanth)తో ఫుల్ రొమాన్స్ చేయాల్సి ఉంది. ఆ సన్నివేశాల్లో నటించడం చాలా ఇబ్బంది అనిపించింది. నాకు కంఫర్ట్ గా లేదని చెప్పాను. నేను అలా చెప్పడం శ్రీకాంత్ కి నచ్చలేదు. ఆయన కోపంగా సెట్స్ నుండి వెళ్లిపోయారని మాళవిక తెలిపారు. అలాగే రేప్ సీన్ లో నటించినందుకు చాలా బాధపడ్డానని ఆమె తెలిపారు. చాలా బాగుంది సినిమాలో మద్యం మత్తులో హీరో శ్రీకాంత్ ఫ్రెండ్ అయిన నవీన్ హీరోయిన్ మాళవికను రేప్ చేస్తాడు.
ఈ విషయం తెలియని శ్రీకాంత్ మాళవికను పెళ్లి చేసుకుంటాడు. తనను రేప్ చేసిన నవీన్ ని మాళవిక మానసికంగా హింసిస్తుంది. ఆమె రోల్ నెగిటివ్ షేడ్స్ కలిగి ఉంటుంది. అలాగే 'సీ యూ యట్ 9' టైటిల్ తో తెరకెక్కిన హిందీ చిత్రంలో రొమాన్స్, ఎక్స్ పోజ్ చేశాను. ఆ సినిమా చూసిన పేరెంట్స్ ఎందుకు చేశావని తిట్టారు. ఆ మూవీ ఎందుకు చేశానన్న బాధ ఉందని మాళవిక తన మనోగతం విప్పారు.
ఇక తెలుగులో విజయ్ దేవరకొండ ఇష్టమని చెప్పిన మాళవిక, రీసెంట్ గా పుష్ప మూవీ చూశాను అన్నారు. ఆ మూవీలో సమంత చేసిన ఊ అంటావా.. సాంగ్ చేసే అవకాశం వస్తే చేస్తావా? అని ఆలీ అడుగగా తప్పకుండా అంటూ సమాధానం చెప్పారు. కాగా మాళవిక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టనున్నట్లు సమాచారం.