బ్రో ...ఈ 'చీటీల చిన్ని' కథ ఏంటో

Published : Jul 15, 2023, 11:25 AM IST
 బ్రో ...ఈ  'చీటీల చిన్ని' కథ  ఏంటో

సారాంశం

ఈ సినిమాలో తేజ్ ఫుల్ ఫన్ తో కూడిన ఎంటర్టైనింగ్ రోల్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది. 


మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది బాగా కలిసి వస్తోంది. ఇప్పటికే విరూపాక్షతో భారీ హిట్ ను సాధించాడు.  తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించిన తేజ్, తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన చిత్రం బ్రో ఈ నెల 28న విడుదల కానుంది. ఆ సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ ఉంది.  ఈ క్రమంలో  తేజ్ తాజాగా మరో కొత్త చిత్రం కమిటయ్యాడు.  కొత్త దర్శకుడు జయంత్ పానుగంటి రూపొందించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో తేజ్ ఫుల్ ఫన్ తో కూడిన ఎంటర్టైనింగ్ రోల్ ను చేస్తున్నట్లు తెలుస్తోంది. 

బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందిస్తున్న ఈ చిత్రంలో సాయి తేజ్ ....చీటీల చిన్ని అనే పాత్రలో కనిపిస్తాడట. పేరుకి తగ్గట్లే చీటీల బిజినెస్ చేస్తాడని చెప్తున్నారు. అలాగే  ఈ చిత్రంలో. ఏజెంట్ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 

ఈ చిత్రంలో చిన్నపాటి క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంటుందని, ఫస్టాఫ్ ఫన్ తోనూ,సెకండాఫ్ లో విలన్ ని పనిపట్టడంతో ముందుకు వెళ్తుందంటున్నారు. సాయి ధరమ్ తేజ్‌ తో కంటిన్యూ సినిమాలు చేస్తన్న  నిర్మాతగా మారిపోయిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్.. ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించనున్నారు. ‘విరూపాక్ష’ చిత్రానికి కూడా ఆయనే నిర్మాతని తెలిసిందే. మొత్తానికి ‘చీటీల చిన్ని’ చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలవనుండగా.. 2024లో విడుదల కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?