
Actress Jayaprada: జయప్రద టాలీవుడ్ లో లెజెండ్రీ నటీమణులలో ఒకరు. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్, కృష్ణం రాజు, చిరంజీవి ఇలా చాలా మంది స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. జయప్రద రాజకీయాల్లో కూడా రాణించారు. ప్రస్తుతం జయప్రద ప్రభాస్ ఫౌజి చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల జయప్రద సోదరుడు రాజబాబు మరణించారు.
తన సోదరుడు రాజబాబు మరణం తర్వాత ఏడవ రోజున అతడి అస్తికలని రాజమండ్రి గోదావరి కలిపేందుకు జయప్రద వచ్చారు తన మేనల్లుడు, సోదరుడి కొడుకు అయిన సామ్రాట్ ని రాజబాబు అస్తికలు గోదావరిలో కలిపేందుకు తీసుకుని వచ్చారు. సాంప్రదాయ బద్దంగా జయప్రద ఈ కార్యక్రమాన్ని జరిపించారు. జయప్రద పుట్టి పెరిగింది రాజమండ్రిలోనే అనే విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా అస్తికలని గోదావరిలో కలుపుతూ జయప్రద కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. మీడియాతో మాట్లాడుతూ గురయ్యారు. నా సోదరుడు ఇక్కడే రాజమండ్రిలో పుట్టి పెరిగాడు. నేను ఎప్పుడు రాజమండ్రికి వచ్చినా నా సోదరుడు రాజబాబుతోనే వచ్చేదాన్ని. కానీ తొలిసారి నా సోదరుడు లేకుండా రాజమండ్రికి రావాల్సి వచ్చింది. మా సోదరుడు ఇటీవల మా నుంచి దూరంగా వెళ్ళిపోయాడు.
నా సోదరుడికి మోక్షం కలగాలని భగవంతుడిని, గోదావరి తల్లిని ప్రార్థిస్తున్నట్లు జయప్రద తెలిపారు. ఈ విషాదకర సమయంలో నా సొంత ఊర్లో, సొంత మనుషుల మధ్య ఉండాలని రాజమండ్రికి రావడం జరిగింది అని జయప్రద అన్నారు.