
కుర్రకారుతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా జెనీలియాకు మంచి క్రేజ్ ఉంది. తెలుగులో జెనీలియా చెరగని ముద్ర వేసింది. ఢీ, రెడీ, బొమ్మరిల్లు లాంటి విజయవంతమైన చిత్రాలు జెనీలియా పేరిట ఉన్నాయి. జెనీలియా తెలుగులో చివరగా నటించిన చిత్రం నా ఇష్టం.
వివాహం తర్వాత వెండితెరకు కాస్త దూరంగా ఉన్న జెనీలియా ఇప్పుడు ఇద్దరు పిల్లలు తల్లి కూడా అయిపోయింది. ఇన్నిరోజులు తల్లిగా పిల్లల ఆలనా పాలనతో బిజీగా ఉన్న జెనీలియా ప్రస్తుతం కాస్త తీరిక పడింది. త్వరలో తన కెరీర్ ని తిరిగి ప్రారంభించాలని భావిస్తోంది. తనకు సరిపడే సరైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు జెనీలియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
తాజాగా జెనీలియా ట్రెండీ లుక్ లో చేసిన ఓ ఫోటో షూట్ ఆకట్టుకుంటోంది. జెనీలియా గ్లామర్ ఇంకా తగ్గలేదంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. జెనీలియా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించింది. దీనితో ఆమె రీ ఎంట్రీ చిత్రం తెలుగులో ఉంటుందా లేక హిందీలో ఉంటుందా అనేది ఎదురుచూడాలి.