నాగ్, చైతుల కాంబినేషన్ మరోసారి తెరపై..?

Published : Nov 07, 2018, 09:22 AM IST
నాగ్, చైతుల కాంబినేషన్ మరోసారి తెరపై..?

సారాంశం

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. చాలా కాలంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమాను తీయాలనుకున్నాడు. 

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 
అసలు విషయంలోకి వస్తే.. చాలా కాలంగా దర్శకుడు కల్యాణ్ కృష్ణ 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' అనే సినిమాను తీయాలనుకున్నాడు.

నాగార్జునకి నచ్చే కథ సెట్ కాక ఇన్నిరోజులు ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల కల్యాణ్ కృష్ణ వినిపించిన కథ నాగార్జునకి నచ్చడంతో తన కొడుకు నాగచైతన్యని కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నట్లు సమాచారం.

కథ ఎలా ఉండబోతుందంటే.. సోగ్గాడే చిన్ని నాయనలో బంగార్రాజు చనిపోగా.. ఆయన కొడుకు రామ్ సీన్ లోకి ఎంటర్ అయి కథను నడిపిస్తాడు. భయస్థుడైన కొడుకు శరీరంలోకి బంగార్రాజు ఆత్మ వచ్చి అతడి సమస్యలను పరిష్కరిస్తుంది.

ఇప్పుడు సీక్వెల్ లో రాముకి ఒక కొడుకు పుడతాడు. అతడు సమస్యల్లో పడ్డప్పుడు బంగార్రాజు ఆత్మ మరోసారి భూమి మీదకి వస్తుంది. దీనిబట్టి నాగార్జున, చైతులు తాతా మనవళ్లుగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ పాయింట్ ని దర్శకుడు ఎంత కన్వీన్సింగ్ గా చూపిస్తాడో చూడాలి!  

PREV
click me!

Recommended Stories

Balakrishna Favourite : బాలయ్య కు బాగా ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? ఆ ఇద్దరే ఎందుకు ?
Prabhas: 2025 లో ఒక్క మూవీ లేని హీరో, కానీ చేతిలో 4000 కోట్ల బిజినెస్.. ఆ రెండు సినిమాలపైనే అందరి గురి ?