ప్రముఖ నటి మరణం.. పిల్లలు రాలేదనే ఆవేదనతోనే!

 |  First Published May 26, 2018, 5:46 PM IST

ఒకప్పటి బాలీవుడ్ తార గీతాకపూర్ మరణించారు. ఈరోజు ఉదయం


ఒకప్పటి బాలీవుడ్ తార గీతాకపూర్ మరణించారు. ఈరోజు ఉదయం ముంబైలో ఆమె తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ లో పలు చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె కూతురు ఎయిర్ హాస్టర్ గా పని చేస్తున్నారు. గీతా కపూర్ కు ఓ కొడుకు కూడా ఉన్నాడు. గతేడాది అతడి తల్లిని వదిలేశాడు. తరువాత నుండి ఆమె బాగోగులు పట్టించుకోవడం మానేశాడు.

అప్పటినుండి నిర్మాత అశోక్ పండిత్ దర్శకుడు రమేష్ లు ఆమెకు సంరక్షణగా ఉంటూ చూసుకుంటున్నారు. తన పిల్లలు చూడడానికి ఒకసారైనా వస్తారని ఆశగా చూసేవారట గీతాకపూర్. చివరిసారి పిల్లల్ని చూడాలని తపించారట.

Latest Videos

వయసు పైబడడంతో ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. ఆమె బౌతికకాయాన్ని కుటుంబ సభ్యుల సందర్శన కోసం హాస్పిటల్ లోనే రెండు రోజుల పాటు ఉంచనున్నారు.  

click me!