
తమిళనాడు రాష్ట్రంలోని వలసరవాక్కంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏకేఆర్ ప్రాంతంలో ఓ సహాయ నటిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహాయ నటి కుమార్తెలకు వివాహమై మనవళ్లు కూడా ఉన్నారు. సదరు నటి ఒంటరిగా నివసించే ప్రాంతంలో కన్నదాసన్ చేపల వ్యాపారం చేసేవాడు. నటి అతని దగ్గర చేపలు కొనుక్కునేది. నటిగా కొన్నాళ్లుగా ఒంటరిగా జీవిస్తోందని పాత ఐరన్ షాపులో పనిచేసే సెల్వకుమార్‌కు కన్నదాసన్ చెప్పాడు. దీంతో సెల్వకుమార్, కన్నదాసన్ లు కలిసి రాత్రి నటి ఇంటికి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
మరుసటి రోజు ఉదయం నటి వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు భారతీయ శిక్షాస్మృతిలోని 448, 376, 294 (బి), 397, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సహాయ నటి తనపై జరిగిన అకృత్యాలను పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ మణిమేగళకు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. చెన్నైలో సహాయ నటికి అర్ధరాత్రి జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు ఆధారంగా ఇన్‌స్పెక్టర్ అబ్రహం క్రూజ్ తురైరాజ్ నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ కళ్యాణ్ పర్యవేక్షణలో సబ్ ఇన్‌స్పెక్టర్లు మణిమేగలై, మహారాజన్, హెడ్ కానిస్టేబుళ్లు హేమకుమార్, బాలకృష్ణన్‌లతో కూడిన ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు.