
క్యాస్టింగ్ కౌచ్ గురించి గత కొంతకాలంగా అన్ని చోట్లా చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు, సినిమావాళ్లు ముఖ్యంగా హీరోయిన్స్ ఈ విషయమై మాట్లాడారు. తమ వాయిస్ వినిపించారు. వివాదాలు సైతం కొని తెచ్చుకున్నారు. ఆఫర్స్ ఇస్తామని ఆశ పెట్టి హీరోయిన్లను పడకగదికి పిలిపించుకునే ప్రక్రియనే క్యాస్టింగ్ కౌచ్ అని చెప్తున్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు సైతం మరీ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ‘దంగల్’ బ్యూటీ ఫాతిమా సనా షేక్ కూడా పెదవి విప్పి కొన్ని నిజాలు ఆవిష్కరించే ప్రయత్నం చేసింది.
ఫాతిమా సనా షేక్ మాట్లాడుతూ... ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని.. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నారని, తనకు కూడా ఇండస్ట్రీలో దారుణమైన అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అలాగే ఇక్కడ పడుకోకుండా ఆఫర్స్ దక్కించుకోవడం చాలా కష్టమంది. ఇదే విషయం తనకు ఎంతోమంది చెప్పారని.. వాళ్లు చెప్పినట్లుగానే ఇక్కడ పరిస్థితులు కూడా దారుణంగానే ఉన్నాయని చెప్పింది. అయితే వాటిని ఎంత తెలివిగా డీల్ చేస్తాము..ఎలా తప్పించుకుంటూ ముందుకు వెళ్తాము అనే విషయమై మన కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పింది.
అలాగే తనను ఎంతోమంది తనను శృంగారం కోసం అడిగారని,వేధించారని, తిరస్కరించినందుకు మంచి మంచి ఆఫర్స్ కూడా కోల్పోయానని తెలిపింది. మహిళలపై లైంగిక వేధింపులు అనేవి కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉన్నాయని ఫాతిమా చెప్పుకొచ్చింది. ఇక తాను మూడేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యానంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫాతిమా. దాన్నిబట్టి పరిస్దితులను అర్థం చేసుకోవచ్చుఅంది.
మూడేళ్ళ కింద దంగల్ సినిమాతో ఫాతిమా సనా షేక్ కు నటిగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమాలో కూడా నటించింది ఫాతిమా. బాలనటిగానే ఈమెకు మంచి పేరొచ్చింది.