అవకాశం కోసం తనతో పడుకోమన్నాడు: ఎవరీ దక్షిణాది దర్శకుడు?

Published : Dec 23, 2020, 12:47 PM IST
అవకాశం కోసం తనతో పడుకోమన్నాడు: ఎవరీ దక్షిణాది దర్శకుడు?

సారాంశం

సౌత్ ఇండియాలో ఎదురైంది అని డొనాల్ ఆవేదన చెందారు. ఓ మూవీ ఆఫర్ ఉందంటూ తనను సంప్రదించిన ఓ దర్శకుడు, తనతో పడుకుంటే ఛాన్స్ ఇస్తాను అని అన్నాడట. ఆ మాటలకు షాక్ తిన్న డొనాల్ అతనిపై కేసు పెట్టారట. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో నటన వదిలివేయాలని అనుకున్నారట.

బాలీవుడ్ బుల్లితెర నటి డొనాల్ బిస్త్ సంచనల ఆరోపణలు చేశారు. సౌత్ పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు పడుకో ఆఫర్ ఇస్తానని అసహ్యంగా మాట్లాడినట్లు చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్ బిస్త్ ఈ విషయాన్ని వెల్లడించారు. కెరీర్ బిగినింగ్ లో డొనాల్ అనేక అవమానకర సంఘటనలు ఎదుర్కొన్నారట. ఓ షో కోసం నన్ను ఎంపిక చేసిన నిర్వాహకులు... ఆ తరువాత నన్ను కాదని మరొక అమ్మాయిని ఎంపిక చేశారు అన్నారు. ఆ సంఘటనతో పరిశ్రమలో ఉండే మనుషులు, మనస్తత్వాలు తెలిశాయని డొనాల్ చెప్పారు. 

అంత కంటే దారుణమైన సంఘటన సౌత్ ఇండియాలో ఎదురైంది అని డొనాల్ ఆవేదన చెందారు. ఓ మూవీ ఆఫర్ ఉందంటూ తనను సంప్రదించిన ఓ దర్శకుడు, తనతో పడుకుంటే ఛాన్స్ ఇస్తాను అని అన్నాడట. ఆ మాటలకు షాక్ తిన్న డొనాల్ అతనిపై కేసు పెట్టారట. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో నటన వదిలివేయాలని అనుకున్నారట. కానీ యాక్టింగ్ పై ఉన్న మక్కువతో, తరచుగా ఆడిషన్స్ కి హాజరవుతూ... అడ్డదారులు తొక్కకుండా కెరీర్ లో ఎదిగినట్లు డొనాల్ బిష్త్ చెప్పారు. 

ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన డొనాల్ బిష్త్, సినిమాపై ఇష్టంతో పరిశ్రమకు వచ్చారు. దిల్ తో హ్యాపీ హై జీ అనే టీవీ సీరియల్ లో నటించిన డొనాల్ బిష్త్ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై వరుస అవకాశాలు అందుకున్నారు. డొనాల్ బిష్త్ కెరీర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండగా, ఒకప్పటి తన చేదు అనుభవాలు నెమరు వేసుకున్నారు. పరిశ్రమ ఏదైనా వేధింపులు అనేవి చాలా సర్వసాధారణం. ప్రతి నటికి ఎదో ఒక సందర్భంలో ఇలాంటి సంఘటన ఎదురయ్యే ఉంటుంది. 
 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా