23 ఏళ్ల కూతురు ఉండగా మరోసారి బిడ్డకి జన్మనిచ్చిన తల్లి.. యువ నటికి మామూలు షాక్ కాదుగా, పెద్ద కథే జరిగింది 

By Asianet News  |  First Published Mar 22, 2023, 9:24 AM IST

మలయాళీ చిత్ర పరిశ్రమలో కాస్త విచిత్రకర సంఘటనే చోటు చేసుకుంది. మలయాళీ బుల్లితెర నటి ఆర్య పార్వతి టీవీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె ఇంట్లో జరిగిన మిరాకిల్ కి ఆర్య పార్వతి సైతం షాక్ కి గురైంది.


మలయాళీ చిత్ర పరిశ్రమలో కాస్త విచిత్రకర సంఘటనే చోటు చేసుకుంది. మలయాళీ బుల్లితెర నటి ఆర్య పార్వతి టీవీ సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె ఇంట్లో జరిగిన మిరాకిల్ కి ఆర్య పార్వతి సైతం షాక్ కి గురైంది. ఆ తర్వాత తేరుగుకుని హ్యాపీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తోంది. విషయం ఏంటంటే ఆర్య పార్వతి తల్లి 47 ఏళ్ల వయసులో గర్భం దాల్చింది. అంతే కూడా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. 

ఈ విషయాన్ని ఆర్య పార్వతి స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో నెటిజన్లు అంతా షాక్ అవుతున్నారు. ఆర్య పార్వతి వయసు 23 ఏళ్ళు. ఈ ఇప్పుడు ఆమెకి ఓ బుల్లి చెల్లి తోడుగా వచ్చింది. 23 ఏళ్ల తర్వాత ఆమె తల్లి గర్భవతి అయితే ఎవరికైనా షాక్ తప్పదు. తన తల్లికి 8వ నెల వచ్చే వరకు ఆర్య పార్వతికి ఈ విషయం తెలియదట. ఇది మరో ట్విస్ట్. ఆమె తల్లికి, తండ్రికి కూడా ఈ సంగతి 7వ నెలలోనే తెలిసిందట. ఆర్య పార్వతి తండ్రి మొదట ఈ విషయాన్ని ఆమెకి చెప్పినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదట. 

Latest Videos

ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలని ఎందుకంటే ఈ సమయంలో సమాజం ఎలా తీసుకుంటుందో తెలియదు అని ఆమె తండ్రి భయాన్ని వ్యక్తం చేశారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తల్లి దండ్రుల నుంచి పిల్లలు ఇలాంటి విషయాలు వినకూడదు కానీ నేను 23 ఏళ్ల వయసులో ఈ వార్త విన్నాను. మా అమ్మ వయసు 47 ఏళ్ళు. ఇది వినడానికి కూడా చాలా విచిత్రంగా ఉంది. ఆ సమయంలో నేను ఇంట్లో లేను. 

ఇంటికి తిరిగి రాగానే అమ్మ ఒడిలో ఏడ్చేశాను. కానీ నాకు నేనే సర్ది చెప్పుకుని.. నేను ఎందుకు ఏడవాలి.. చిన్నప్పుడే నాకు ఓ చెల్లి ఉంటే బావుండేది అని అనుకున్నా. ఇప్పుడు ఆ కోరిక తీరుతోంది అనుకున్నా. ఇప్పుడు తనకి తోడుగా బుల్లి చెల్లి వచ్చింది. మా అమ్మ బాధ్యతని, చెల్లి బాధ్యతని నేనే తీసుకుంటున్నా అంటూ ఆర్య పార్వతి సంతోషంగా తెలిపింది. 

ఆర్య పార్వతి జన్మించాక.. ఆమె తల్లికి గర్భాశయంలో ఏదో సమస్య తలెత్తిందట. ఆమెకి మరోసారి గర్భం వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్పారట. కానీ మిరాకిల్ జరిగినట్లు 23 ఏళ్ల తర్వాత ఆమె తల్లి గర్భవతి అయి మరో బిడ్డకి జన్మనిచ్చింది. అయితే నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

click me!