
రెండు ఆస్కార్లు అందుకోవడంతో.. ఇండియాలో పండగ వాతావరణం ఏర్పడింది. అందులోను రెండు ఆస్కార్ లు సౌత్ నుంచే రావడంతో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సందడి అంతా ఇంతా కాదు. ట్రిపుల్ ఆర్ టీమ్ సంబరాలు చేసుకుంటుంటే.. ఆస్కార సాధించిన షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాత మాత్రం తన ఆవేదనను వెల్లడించారు. షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోంగా..ఆస్కార్ వేదికపై తనకు జరిగిన అవమానాన్ని గురించి చెపుతూ.. బాధపడ్డారు.
ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యూమెంటరీ ఫిల్మ్.. ఆస్కార్ సాధించి.. అందరి చూపు తమైపు తిప్పుకుంది. అంతా ట్రిపుల్ ఆర్ పై దృష్టి పెట్టగా..ఎటువంటి హడావిడి లేకుండా ఆస్కార్ ను సాధించింది ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యూమెంటరీ ఫిల్మ్. అంతే కాదు హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా కూడా మారింది. ఇక ఈక్రమంలో ఆస్కార్ వేడుకల గురించి ఈ డాక్యూమెంటరీ నిర్మాత గునీత్ మోంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆస్కార్ అవార్డు తీసుకున్నాక నాకు అవమానం జరిగింది. ఇది నాకు మాత్రమే కాదు.. ప్రతీ భారతీయులకు జరిగిన అవమానం అన్నారు. సాధారణంగా ఆస్కార్ అందుకున్న అనంతరం ప్రతి ఒక్కరికీ 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఎవరైనా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే వారి మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ నేను మాట్లాడటం స్టార్ట్ చేయగానే, నా మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారు అంటూ ఆవేదన వ్యాక్తం చేసింది గునీత్.
వాళ్ళు అలా చేయడం వల్ల... తాను చెప్పాలి అనుకున్న విషయాలు చెప్పలేకపోయాని బాధపడ్డారు గునీత్. ఏం మాట్లాడకుండేనే నేను వెనుదిరగాల్సి వచ్చింది అని గునీత్ మోంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేసేసరికి.. ఆస్కార్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు అనిపించిందన్నారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. భారత్ మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నానని గునీత్ చెప్పారు. ప్రస్తుతం గునీత్ మోంగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈనెల 12న అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 95వ అకాడమీ అవార్డ్స్ లో.. స్పెషల్ గా నిలిచింది ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట. మొట్ట మొదటి సారి తెలుగు సినిమాకు ఆస్కార్ అందించడంతో పాటు.. హాలీవుడ్ స్టార్స్ చేత కూడా స్టెప్పులేపించింది సాంగ్. అంతే కాదు అంతర్జాతీయంగా టాలీవుడ్ సినిమాకు గుర్తింపు తీసుకొచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. ఇక ఆర్ఆర్ఆర్ తో పాటు అనూహ్యంగా ది ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యూమెంటరీ ఫిల్మ్ కూడా ఆస్కార్ సాధించింది. ఒక తప్పిపోయిన ఏనుగును.. చేరదీసిన పేద దంపతుల కథతో ఈ షార్ట్ మూవీ తెరకెక్కిందిత.