
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనుష్క,.. మీడియా ముందుకు రాగానే అందరూ అడిగే కామన్ ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు..? అని. ఇప్పటికి చాలా సార్లు అనుష్క పెళ్లి ప్రస్తావన వచ్చింది. హీరో ప్రభాస్ తో అనుష్క పెళ్లి జరుగతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే.. తాము పెళ్లి చేసుకోవడం లేదని.. కేవలం స్నేహితులమేనని ప్రభాస్, అనుష్కలు క్లారిటీ ఇచ్చారు.
కాగా... ఈసారి అనుష్క తన పెళ్లి వార్తను మనందరితో పంచనుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో స్వీటీ ఎవరిని పెళ్లాడబోతుందా, ఆ లక్కీఫెలో ఏవరాని తెలుసుకునేందుకు ఆమె అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే ఆమె.. ఈ మధ్య కాస్తా మూవీస్ తగ్గించింది. దీంతో ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపోతోంది. ఈ క్రమంలో అనుష్కకు త్వరలో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. దీనికి స్వీటీ కూడా ఓకే అనడంతో వరుడి వేటలో పడినట్లు సమచారం.
కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి చివరకు ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. ఆ అబ్బాయి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకుగా తెలుస్తోంది. దీంతో అతడితోనే మన స్వీటి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. అయితే అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అంతా కుదిరితే కరోనా పరిస్థితులు సాధారణం స్థితికి వచ్చాక ఇరుకుంటుంబాలు చర్చించుకుని పెళ్లికి ముహుర్తం పెట్టుకొవాలనుకుంటున్నట్లుగా వినికిడి. కాగా ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అనుష్క స్పందించే వరకు వేచి చూడాల్సిందే.