
నటి, యాంకర్ అయిన అనసూయ భరద్వాజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో గ్లామర్ తో పాపులర్ అయిన యాంకర్లలో అనసూయ ఒకరు. ప్రస్తుతం అనసూయ నటిగా కూడా దూసుకుపోతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది. రంగస్థలం చిత్రంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
అనసూయ తరచుగా వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. ఏదో విధంగా అనసూయపై తరచుగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ తన మనసులో అభిప్రాయాల్ని బయటకు చెప్పేందుకు అనసూయ ఏమాత్రం వెనకడుగు వేయదు.
తాజాగా అనసూయకి ఆన్లైన్ లో ఊహించని షాక్ తగిలింది. అనసూయ ఆన్లైన్ మోసానికి గురైందట. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. అనసూయ ట్రఫుల్ ఇండియా అనే క్లోతింగ్ వెబ్సైట్ లో బట్టల్ని ఆర్డర్ పెట్టిందట. దీనికోసం భారీ మొత్తంలో ఆమె డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఆర్డర్ పెట్టి నెల రోజులు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు తనకి కొరియర్ రాలేదని.. ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని అనసూయ చెబుతోంది.
అవకాశం చూసి తనని ఆ సంస్థ మోసం చేసినట్లు అనసూయ గ్రహించింది. ఇంతవరకు డబ్బులు రిఫండ్ కూడా చేయలేదు. కేవలం మోసం చేయడానికి మాత్రమే ఆన్లైన్ లో ఎదురు చూసే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని అనసూయ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. బాధ్యత లేని ఇలాంటి ఆన్లైన్ స్టోర్ ల పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ అనసూయ నెటిజన్లను హెచ్చరించింది.