ప్రముఖ విలన్ టార్జాజ్ ఇంట తీవ్ర విషాదం!

Published : Jun 17, 2021, 11:54 AM ISTUpdated : Jun 17, 2021, 11:57 AM IST
ప్రముఖ విలన్ టార్జాజ్ ఇంట తీవ్ర విషాదం!

సారాంశం

లక్ష్మీనారాయణ గుప్తా భార్య ఉమారాణి మరణించారు. 52ఏళ్ల ఉమారాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.జూన్ 13 ఆదివారం రాత్రి ఉమారాణి గుండెపోటు గురయ్యారు. 


టాలీవుడ్‌ విలన్‌ కమ్ కమెడియన్  టార్జన్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణ గుప్తా ఇంట విషాదం చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ గుప్తా భార్య ఉమారాణి మరణించారు. 52ఏళ్ల ఉమారాణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం.జూన్ 13 ఆదివారం రాత్రి ఉమారాణి గుండెపోటు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. 


అయితే ఉమారాణి  మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. ఆమె మరణం పట్ల సినీ పెద్దలు సంతాపం ప్రకటించారు. కాగా టార్జన్‌ లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. 

ఇక చాలా కాలంగా లక్ష్మీనారాయణ గుప్తా టాలీవుడ్ లో విలన్ కమ్ కమెడియన్ గా ఉన్నారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా చేసిన ఆయన కామెడీ రోల్స్ కూడా చేయడం జరిగింది. వందల చిత్రాలలో లక్ష్మీనారాయణ గుప్త వివిధ పాత్రలు చేశారు. 


 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు