స్టార్ హీరో సూర్య కొడుకు డెబ్యూ!

By Udayavani DhuliFirst Published Jan 17, 2019, 4:26 PM IST
Highlights

తమిళ అగ్ర హీరో సూర్య కొడుకు దేవ్ ఇప్పుడు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే తమిళనాట అగ్ర హీరోల కుమారులు నటులుగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సూర్య కొడుకు దేవ్ కూడా తన డెబ్యూ కోసం రెడీ అవుతున్నాడు.

ఏడేళ్ల వయసు గల దేవ్ ని ఓ కొత్త డైరెక్టర్ వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఓ చిన్న పిల్లాడికి కుక్కపిల్లకి మధ్య ఉన్న అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని కోలివుడ్ వర్గాల సమాచారం. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

నిజానికి గతంలో ఈ సినిమా కోసం 2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లను పిలిపించి ఆడిషన్స్ నిర్వహించింది. ఫైనల్ గా సూర్య కుమారుడినే ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసినట్లు సమాచారం. దేవ్ తో పాటు ఈ సినిమాలో మరో ముప్పై మంది పిల్లలు నటించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికార ప్రకటన రానుంది. 

click me!