వ్యూస్ కోసం చంపేస్తారా..? నటుడు సునీల్ ఫైర్!

Published : Mar 16, 2019, 09:43 AM IST
వ్యూస్ కోసం చంపేస్తారా..? నటుడు సునీల్ ఫైర్!

సారాంశం

సినీ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఇది చూసిన అభిమానులు కొందరు ఆందోళన చెందారు. 

సినీ నటుడు సునీల్ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఓ వెబ్ సైట్ కథనం ప్రచురించింది. ఇది చూసిన అభిమానులు కొందరు ఆందోళన చెందారు. ఆయన  క్షేమంగా ఉన్నారా లేదా..? అని తెలుసుకోవడంకోసం సునీల్ ని సంప్రదించే ప్రయత్నాలు చేశారు.

విషయం తెలుసుకున్న సునీల్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. అది తప్పుడు వార్త అని, తను క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. వ్యూస్  కోసం ఇలాంటి వార్తలు రాయడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయ్యారు. 

సునీల్ అభిమానులు ఇలాంటి వందతులు పుట్టిస్తున్న వారిని శిక్షించాలని, వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సినిమాల విషయానికొస్తే.. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్.. హీరోగా టర్న్ తీసుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

కానీ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు సునీల్.

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు