తమిళంలో శ్రీకాంత్ - భూమికా కాంబోలో కొన్ని సినిమాలు వచ్చి అలరించాయి. అయితే ఇద్దరూ తెలుగులోనూ ఆడియెన్స్ కు గుర్తుండిపోయేలా సినిమాలు చేశారు. అయితే ఓ సందర్భంలో భూమిక శ్రీరామ్ కు అదుపుచేయలేని కోపం తెప్పించిందంట..
తమిళ హీరో శ్రీరామ్ (Sriram) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం. ముఖ్యంగా ‘స్నేహితుడు’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అంతకంటే ముందుకు తమిళంలో హీరోగా వరుపెట్టి సినిమాలు చేశారు. 20 ఏళ్లకుపై గా తెలుగు, తమిళంలో చాలా సినిమాల్లో నటించారు. కోలీవుడ్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇక టాలీవుడ్ లో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూఅలరిస్తూ వస్తున్నారు. శ్రీరామ్ అసలు పేరు శ్రీకాంత్. తెలుగులో ‘ఒకరికి ఒకరు’ చిత్రంతో శ్రీరామ్ గా మారారు.
‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘దడ’, ‘నిప్పు’. ‘లై’, చివరిగా తెలుగులో రవితేజ ‘రావణసుర’లో నటించారు. కొద్దికాలంగా టాలీవుడ్ లో కీలక పాత్రల్లో అలరిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీరామ్ తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఫేవరెట్ హీరోయిన్ అంటూ భూమికా గురించి మాట్లాడుకొచ్చారు. అలాగే Bhumika Chawla పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
undefined
వీరి కాంబినేషన్ లో ‘రోజాపూలు’, ‘బడీ’, ‘కన్నై నంబతే’ వంటి చిత్రాలు వచ్చాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో శ్రీరామ్ మాట్లాడుతూ.. తన ఫేవరెట్ హీరోయిన్ అంటే భూమికా చావ్లా అని చెప్పుకొచ్చారు. కానీ ఆమెనే చంపేయాలన్నంత కోపం కూడా వచ్చిందని చెప్పుకొచ్చారు. ఓ మూవీ షూటింగ్ సగం అవ్వగానే సెట్ లో నుంచి వెళ్లిపోయిందంట. ఆ తర్వాత చాలా రోజులకు ఎయిర్ పోర్టులో కలిసి.. మూవీ పూర్తైందా? అంటూ పలకరించిందంట.. ఆ సమయంలో అక్కడే చాక్ తో పొడిచి చంపాలన్నంత కోపం కూడా వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. వారి మధ్య చిన్నచిన్న గొడవలు ఉన్నాయన్నారు.
మూడు రోజుల కిందనే తనతో మాట్లాడనని అప్పుడు ఆమె చేసిన పనిని గుర్తుచేస్తే నవ్వుకుందని చెప్పారు. ఇప్పుడు ఇద్దరం నవ్వుకుంటున్నాం గానీ.. అప్పుడు నువ్వు నవ్వి ఉంటే పరిస్థితి వేరేలా ఉందని బదిలిచ్చినట్టు తెలిపారు. అయితే.. సినిమా నిర్మించే క్రమంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయని టీమ్ అందరూ కూల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్లాలని అభిప్రాయపడ్డారు. కొందరైతే ఆర్టిస్టుల మీద ఊరికనే నోరుజారుతుంటాని, అది ఏమాత్రం సరికాదన్నారు. తమిళంలో దర్శకుడు శంకర్ వర్క్ స్టైల్ బాగుంటుందన్నారు. ఆర్టిస్టులను బాగా చూసుకుంటారని చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ సుకుమారన్ అంటే కూడా తనకు చాలా గౌరవమని చెప్పారు. మొత్తానికి శ్రీరామ్ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.