ఇటుకల బట్టీలో పనిచేస్తున్న సోనూసూద్, మరోసారి సింప్లిసిటీ చాటుకున్న రియల్ హీరో..

By Mahesh JujjuriFirst Published Jun 3, 2023, 7:50 PM IST
Highlights

సోనూసూద్ మరోసారి తాను ఎంత సింపుల్ గా ఉంటాడో నిరూపించుకున్నాడు. ఈసారి ఏకంగా కార్మికుడి అవతారం ఎత్తి ఎండలో కష్టపడిపనిచేశాడు రియల్ హీరో. 

కరోనా టైమ్ లో ఎంతో మందిని ఆదుకుని.. రియల్ హీరో, పేదలపాలిటి దేవుడు అని రకరకాల మన్ననలు పొందిన బాలీవుడ్ హీరో సోనూసూద్. కరోనా తరువాత కూడా ఆయన చాలా మందిని ఆదుకున్నాడు.  ఎంతో మందిని చదివించాడు. ఇలా చాలా వరకూ చాలా మందికి సాయం చేస్తూ.. రీల్ విల్ కాస్త రియల్ హీరో అయిపోయాడు సోనూ సూద్. ఈ క్రమంలో ఆయన మరోసారి తన గొప్ప మనసును, సింపుల్ సిటీని చాటుకున్నాడు.

తాజాగా సోనూసూద్  తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు చేశాడు. తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నాడు. కార్మికులలో కార్మికుడిగా కష్టపడ్డాడు. ఇటుకలు తయారు చేస్తున్న కార్మికుల దగ్గరకు వెళ్లిన సోనూ వారి కష్టసుఖాలు తెలుసుకున్నాడు. అంతే కాదు అంత ఎండలో తాను కూడా ఇటుకలు తయారు చేయడం నేర్చుకున్నాడు.  అక్కడ పని చేసే ఓ కార్మికుడి దగ్గరకు వెళ్లి ఇటుకలు తయారు చేయడంలో మెళకువలు  నేర్చుకున్నాడు. 

అంతే కాదు కొద్దిసేపు అలా చూసి.. వెంటనే  సోనూయే స్వయంగా ఇటుకలు తయారు చేశాడు. ఇక ఈ తతంగం అంతా వీడియో చేసి.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రియల్ హీరో.. ఇక వెంటనే  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇక ఈ వీడియోను షేర్ చేసిన  సోనూ సూద్ ఓ సందేశం కూడా ఇచ్చారు.  దేశంలోని కార్మికులే దేశాన్ని బలంగా తయారు చేస్తారు అని.. ఈ వీడియోకు అదిరిపోయే మంచి క్యాప్షన్ రాశాడు. 

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసి సోనూ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిజంగా సోనూ.. నువ్వు బంగారం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత మంచివాడివేంటయ్యా నువ్వు అంటూ మురిసిపోతున్నారు. సెల్యూట్ సోనూ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

click me!