సత్య ప్రకాష్ జీవితంలోనే గుర్తుండిపోయే పనిచేసిన చీరంజీవి.. ఎమోషనల్ అయిన నటుడు!

Published : Jan 29, 2024, 11:23 AM ISTUpdated : Jan 29, 2024, 11:24 AM IST
సత్య ప్రకాష్ జీవితంలోనే గుర్తుండిపోయే పనిచేసిన చీరంజీవి..  ఎమోషనల్ అయిన నటుడు!

సారాంశం

నటుడు సత్యప్రకాశ్ Satya Prakash చిరంజీవి గురించి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ గొప్ప మనస్సును తెలియజేసే ఓ ఘటనను వివరించారు. తనకోసం అలా చేస్తారని ఊహించలేదని చెప్పుకొచ్చారు. 

మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా ‘భోళా శంకర్’ తో అలరించారు. నెక్ట్స్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ Vishwambara అనే ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. సినిమాల పరంగా మెగాస్టార్  ఎంత ఎత్తుకు వెళ్లారో... వ్యక్తిగతంగానూ ప్రశంసలు పొందుతున్న విషయం తెలిసిందే. 

చిరంజీవి సినిమానే ప్రాణంగా బతుకుతున్న వారికి తనవంతుగా సాయం చేస్తూనే వస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని వెంటనే ఆదుకుంటున్నారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవలకు సినీ లోకం కొనియాడిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా మెగాస్టార్ కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ Padma Vibhushan అవార్డును కూడా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.  ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై నటుడు సత్య ప్రకాష్ Satya Prakash ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి గతంలో తనకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకున్నారు. 

రీసెంట్ ఇంటర్వ్యూలో సత్య ప్రకాష్ మాట్లాడుతూ..  ‘నా కెరీర్ ప్రారంభంలో నాకు ఎల్ఎంఎల్ స్కూటర్ ఉండేది. దానిపైనే షూటింగ్స్ కు వెళ్లే వాడిని. ఓసారి అన్నయ్యతో కలిసి సినిమా చేస్తున్నాను. ఆ సమయంలో కూడా స్కూటీపైనే షూటింగ్ కు వెళ్లాను. ఆ విషయం ఆయనకు తెలిసిందే. నన్ను కూడా అడిగారు నువ్వు షూటింగ్ కు ఎలా వస్తున్నావని... హెల్మెట్ పెట్టుకోమని సూచించారు. మంచి నటుడినని అభినందించారు. ఆ తర్వాతి రోజు నన్ను పిలిచి కారు కొనుక్కోమని డబ్బులిచ్చారు. అలా నా ఫస్ట్ కారు సొంతమైంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. అని చెప్పుకొచ్చారు.  ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు