నటుడు సత్యరాజ్ అరెస్ట్ పై క్లారిటీ!

Published : Jan 30, 2019, 02:49 PM IST
నటుడు సత్యరాజ్ అరెస్ట్ పై క్లారిటీ!

సారాంశం

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 

'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యరాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.

అయితే ఇప్పుడు అసలు విషయం తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి తమిళనాడులోని ఎండీఎంకే పార్టీ నేత సత్యరాజ్ బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆదివారం నరేంద్ర మోదీ తమిళనాడులోని మదురైలో పర్యటించిన సంగతి తెలిసిందే. 

ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ ఎండీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో నాగపట్టణం జిల్లాలో శీర్గాలీ పట్టాన కార్యదర్శిగా ఉన్న సత్య రాజ్ బాలు 'చిప్ప పట్టుకున్న మోదీ' వ్యంగ్య చిత్రాన్ని తన సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో బీజేపీ నేతలు ఆగ్రహించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సత్యరాజ్ బాలుపై చర్యలు తీసుకొని అతడిని అరెస్ట్ చేశారు. పేర్లు ఒకటే కావడంతో సోషల్ మీడియాలో సత్యరాజ్ అరెస్ట్ అని వార్తలు రాగానే అందరూ సినీ నటుడు సత్యరాజ్ అనుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి