ఊర్వశీ రౌతాలా లీగల్ నోటిస్ , అఖిల్ పైనా,తన పైనా నోటికొచ్చినట్లు వాగినందుకు

Published : Apr 23, 2023, 01:55 PM IST
ఊర్వశీ రౌతాలా లీగల్ నోటిస్ , అఖిల్ పైనా,తన పైనా నోటికొచ్చినట్లు వాగినందుకు

సారాంశం

ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని లీగల్ నోటీస్ పంపినట్లు ఆమె ఇనిస్ట్రాలో రాసుకొచ్చింది. 


‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ... బాసూ వేర్‌ ఈజ్‌ ద పార్టీ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగులో ఓ రేంజిలో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్‌ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్  కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు.  అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’ చిత్రంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించాడు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశి కాలు కదిపింది. ఇది మాస్ ట్యూన్ లో వచ్చే జానపద గేయం అని తెలుస్తోంది.  

అయితే ఈ పాట పూర్తైంది, సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే తనను తాను స్వయం ప్రకటిత రివ్యూ రైటర్ గా, విశ్లేషకుడుగా చెప్పుకునే  ఉమర్ సింధూ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అఖిల్ అక్కినేని  ..ఏజెంట్ చిత్రం యూరోప్ షూటింగ్ లో ఉండగా ఊర్వశీ రౌతాలా ని హెరాస్ చేసాడని, అతను ఇమెట్యూర్ ఏక్టర్  అని, అతనితో పనిచేయటం కంపర్ట్ గా లేదని ఆమె ఫీలవుతున్నట్లుగా ట్వీట్ చేసాడు.

అయితే ఈ ట్వీట్ ని ఆమె ఖండిస్తూ ..లీగల్ నోటిస్ పంపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని లీగల్ నోటీస్ పంపినట్లు ఆమె ఇనిస్ట్రాలో రాసుకొచ్చింది. అయితే ఆ పోస్ట్  లో ఆమె అతని  ప్రస్తావన చేయలేదు. 

ఇక ఈ పాటని భారీ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం. కాగా, అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టిన ఈ చిత్రం ఈనెల 28న ‘ఏజెంట్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో  సాక్షి వైద్య  హీరోయిన్ గా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్ సినిమాపై అఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించాడు.
 

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా