టార్గెట్ శ్యామల... ఈసారి ఆ నటుడు వంతు, సో కాల్డ్ యాంకర్ అంటూ ఫైర్!

By Sambi ReddyFirst Published Jul 4, 2024, 6:13 PM IST
Highlights

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపిన యాంకర్ శ్యామల మీద టాలీవుడ్ ప్రముఖుల నిరసన కొనసాగుతున్నాయి. తాజాగా మరో నటుడు ఆమెపై విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ని శ్యామల విమర్శించిన నేపథ్యంలో కౌంటర్ ఇచ్చారు. 
 

2024 సార్వత్రిక ఎన్నికల్లో టాలీవుడ్ బహిరంగంగా ఒక పక్షం తీసుకుంది. మెజారిటీ నటులు, దర్శక నిర్మాతలు కూటమికి మద్దతు తెలిపారు. కొందరు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగింది. చిరంజీవి జనసేనకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని వీడియో బైట్ విడుదల చేశారు. నాగబాబు, ఆయన సతీమణి, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు నిర్మాత సూర్యదేవర నాగవంశీ టీడీపీ+బీజేపీ+జనసేన కూటమికి ఓటు వేయాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కూటమికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపిన టాలీవుడ్ ప్రముఖుల లిస్ట్ పెద్దదే ఉంది. టాలీవుడ్ ని శాసించే రెండు కుటుంబాలు ఒక్కటిగా పోటీ చేయడం కూడా దీనికి కారణం. అదే సమయంలో టాలీవుడ్ పట్ల వైఎస్ జగన్ వ్యవహరించిన తీరు నచ్చక పోవడం మరొక కారణం. 

Latest Videos

ఇక సామాజిక సమీకరణాలు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీకి మద్దతు తెలిపి పెద్ద రిస్క్ చేసింది యాంకర్ శ్యామల. నిజానికి కూటమి గెలిచినా ఓడినా శ్యామలకు రిస్కే. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా టాలీవుడ్ లో ఉన్న ఆ పార్టీ సానుభూతి పరులకు ఆఫర్స్ లేవు. అలీ, పోసాని ఈ కోవలోకి వస్తారు. 30 ఇయర్స్ పృథ్వి జనసేనలోకి వచ్చాక పరిస్థితి మారింది. 

కాగా ఎన్నికల సమయంలో యాంకర్ శ్యామల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై విమర్శలు చేశారు. ఆయన మీద ఓ కథ కూడా చెప్పారు. శ్యామల వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడ్డారు. ఆమెను ట్రోల్ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం శ్యామల ఆందోళనకు గురైంది. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆవేదన చెందింది. ఇక శ్యామలను పలువురు టాలీవుడ్ ప్రముఖులు విమర్శించారు. 

తాజాగా నటుడు సమీర్ శ్యామల గతంలో పవన్ కళ్యాణ్ మీద చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చాడు. ఎవరో సో కాల్డ్ యాంకర్ పవన్ కళ్యాణ్ సహాయం చేయడం ఎప్పుడు చూడలేదట. ఆమె ఎవరో మీకు తెలుసు. ఒకసారి నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన పేపర్ చదువుతున్నారు. 

న్యూస్ పేపర్లో రిక్షా కార్మికుడు కూతురు నాకు చదువుకోవాలని ఉంది. ఎవరైనా సహాయం చేయండి అని అర్థిస్తున్న వార్త చూసి వెంటనే స్పందించారు. తన మేనేజర్ ని పిలిచి వివరాలు కనుక్కొని తన చదువుకు ఏర్పాట్లు చేయాలని చెప్పాడని, సమీర్ అన్నారు. మొత్తంగా శ్యామల వైసీపీకి మద్దతు పలికి కెరీర్ నాశనం చేసుకోవడంతో పాటు, విమర్శల పాలవుతుంది. 

click me!