‘మట్కా’ కోసం రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకున్న వరుణ్ తేజ్?

By Surya PrakashFirst Published Jul 4, 2024, 9:08 AM IST
Highlights

 వరుణ్ తేజ తన రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకోవటమే కాకుండా మిగతా టీమ్ చేత కూడా సాధ్యమైన మేరకు తగ్గించుకుని 

తనకు మార్కెట్ ఓ మాదిరిగా ఉన్నప్పుడు భారీ బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేస్తే...అందుకు తగినట్లు హీరోలు తమ రెమ్యునరేషన్ లు తగ్గించుకుని సహకరిస్తే నిర్మాతలు ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలగుతారు. బడ్జెట్ సమస్యలతో ముందుకు వెళ్లలేకపోతోందని వార్తలు వచ్చిన మట్కా మూవీ ఇప్పుడు షూటింగ్ జోరందుకుంది. అందుకు కారణం వరుణ్ తేజ తన రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకోవటమే కాకుండా మిగతా టీమ్ చేత కూడా సాధ్యమైన మేరకు తగ్గించుకుని సహకరించమని కోరినట్లు సమాచారం. అసలు వరుణ్ తేజ ఎంత తీసుకుంటున్నారు ఓ సినిమాకు అనేది చూస్తే..

 వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మట్కా’ (Matka) ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఇది 35 రోజుల లాంగ్ షూటింగ్ షెడ్యూల్ అనే విషయాన్ని మేకర్స్ ముందుగానే తెలియజేశారు. ఈ ఒక్క ఫేజ్‌కే సుమారు రూ. 15 కోట్ల మ్యాసీవ్ బడ్జెట్‌ను కేటాయించినట్లుగా సమాచారం. ప్రొడక్షన్ టీం వింటేజ్ వైజాగ్ లోకేషన్స్‌ని రామోజీ ఫిల్మ్ సిటీ (RFC)లో మ్యాసీవ్ సెట్‌లలో రిక్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించే లక్ష్యంతో చిత్ర టీం వర్క్ చేస్తోంది. దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణ కుమార్ (Karuna Kumar) ఈ సినిమా కోసం మ్యాసీవ్ స్క్రిప్ట్‌ను రూపొందించారు. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు 50 కోట్లు దాకా ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వరుణ్ తేజ్ ....తన రెగ్యులర్ రెమ్యునరేషన్ 12 కోట్లు తీసుకోవాలి. కానీ ఆ బడ్జెట్ వెళ్లి ప్రొడక్షన్ పై పడకుండా సగానికి సగం తగ్గించి అంటే ఆరు కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ...కొన్ని ఏరియా రైట్స్ ఇస్తారని చెప్పుకుంటున్నారు. 

మట్కా సినిమాలో వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరితోపాటు నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విశాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తుండగా అప్పట్లో విశాఖ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి ఓ భారీ సెట్టింగ్ కి భారీ ఖర్చుతో మేకర్స్ వేసారట. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల వరుణ్ తేజ్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అది అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. అంచనాలను అందుకోలేకపోయింది.
 

click me!