
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఇటీవల ఓ మహిళ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సుభాష్ 'మీటూ' ఉద్యమం ఓ ఫ్యాషన్ లా తయారైందంటూ విమర్శలు చేశాడు.
అయితే సుభాష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ మోడల్, నటి కేట్ శర్మ తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయనతో తనను దగ్గరకి లాక్కొని తప్పుగా బిహేవ్ చేశాడని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఆమె మాట్లాడుతూ.. ''సుభాష్ నన్ను తన ఇంటికి పిలిపించాడు. ఆయన ఇంట్లో అరడజను మంది ఉన్నారు. వారందరి ముందే నన్ను మసాజ్ చేయమని అడిగాడు.
ఆయన అలా అడగడంతో నేను షాక్ అయ్యాను. కానీ ఆయన వయసుకి గౌరవమిచ్చి అందరి ముందే కాసేపు మసాజ్ చేశాను. ఆ తరువాత చేతులు క్లీన్ చేసుకోవడానికి బాత్రూం కి వెళ్లగా.. ఆయన నా వెంటే వచ్చి ఏదో మాట్లాడాలని ఆయన రూమ్ కి తీసుకొని వెళ్లాడు. నన్ను దగ్గరకి లాక్కొని కౌగిలించుకొని, ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు.
నేను వెంటనే అక్కడ నుండి వెళ్లాలని చెప్పగా.. ఓ రాత్రి నాతో గడపకపోతే నీకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరించాడు'' అంటూ కేట్ శర్మ మీడియా ముఖంగా వెల్లడించారు. మరి ఈ విషయంపై దర్శకుడు సుభాష్ ఎలా స్పందిస్తాడో.. చూడాలి!
ఇది కూడా చదవండి..
బడా డైరెక్టర్ పై అత్యాచారం ఆరోపణలు!