రాజీవ్ కనకాల ఎందుకు ఇలా అయ్యారు, క్లారిటీ ఇచ్చిన స్టార్ నటుడు

By Mahesh JujjuriFirst Published Jan 5, 2024, 3:42 PM IST
Highlights

యాక్టర్ రాజీవ్ కనకాల గుర్తున్నాడు కదా.. ఎన్నో సినిమాల్లో యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఆయన.. రీసెంట్ గా లుక్ ఎలా ఉందో చూశారా.. ఈమధ్య బాగా లావయ్యారు రాజీవ్.. కారణం ఏంటో తెలుసా.. ? ఆయనే స్వయంగా వెల్లడించారు కూడా. 

రాజీవ్ కనకాల ..టాలీవుడ్ స్టార్ నటుడు, స్టార్ యాంకర్ సుమ కనకాల భర్త.. ఇక తాజాగా వీరిద్దరి తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అయ్యాడు కూడా.  నటుడిగా.. సుమ భర్తగా అందరికి సుపరిచితమే రాజీవ్ కనకాల.  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాజీవ్ ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. స్టార్ హీరోల సరసన క్యారెక్టర్ రోల్స్ ను అవలీలగా పోషించారు.. చాలాసింపుల్ గా డైలాగ్ డెలివరి..నాచురల్ యాక్టింగ్ తో టాలెంట్ చూపించేవారు రాజీవ్. 

అయితే ప్రస్తుతం విషయం ఏంటంటే.. రాజీవ్ కనకాల ఈ మధ్య ఎందుకో  బాగా లావయ్యారు. అయితే ఈవిషయం మీడియా అంటం కాదు.. ఎవరు చూసినా అనిపిస్తుంది. అంతే కాదు అసలు ఇందుకు కారనం ఉంటీ.. ఆయన ఏందుకు అలా అయ్యారు అన్న విషయాన్ని స్వయంగా వెల్లడించారు రాజీవ్. రాజీవ్‌కి  ఆ మధ్య ఫుడ్ పాయిజన్ అయ్యిందట. ఆసుపత్రిలో జాయిన్ అయ్యాక సెలైన్స్, యాంటిబయాటిక్స్ ఇచ్చారట. ఆ సమయంలో ఆసుపత్రిలో ఇచ్చిన ఫుడ్.. ఇంటి నుండి వచ్చిన ఫుడ్ కూడా తినేసేవారట. ఇక ఇంటికి వచ్చాక కూడా రోజూ స్వీట్స్ తినాలనిపించి రోజూ ఎక్కవ మోతాదులో  స్వీట్స్ తినేసేవారట. దాంతో సడెన్‌గా బరువు పెరిగిపోయానని అంటున్నారు రాజీవ్. 
అయితే తాను  ప్రస్తుతం బరువు తగ్గడానికి చాలా ప్రయత్నిస్తున్నానంటున్నారు. ప్రస్తుతం రాజీవ్ కనకాల పలు సినిమాల్లోనటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  గేమ్ ఛేంజర్  మూవీలో నటిస్తున్నారు. ఈసినిమాతో పాటు కొన్ని పెద్ద  ప్రాజెక్ట్ లు కూడా ఆయన చేస్తున్నట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ కు స్నేహితుడిగా నటించిన ఆయన ప్రస్తుతం హీరోయిన్లకు తండ్రి పాత్రలు చేయడానికి కూడా వెనకాడటంలేదు. 

Latest Videos

ఇక టెలివిజన్ రంగంలో కెరియర్ మొదలుపెట్టి బిగ్ స్క్రీన్‌పై నాన్ స్టాప్‌గా సినిమాలు చేశారు రాజీవ్.  రాంబంటు సినిమాతో మొదలైన ఆయన ప్రయాణం స్టూడెంట్ నంబర్ 1, ఆది, నువ్వే నువ్వే, నాగ, ఫిల్మ్ బై అరవింద్, మీనాక్షి, యమదొంగ, సరిలేరు నీకెవ్వరు, లాంటి పెద్ద పెద్ద సినిమాల్లో నటించి మెప్పించారు. ఇక రీసెంట్ గా  రాజీవ్-సుమ దంపతుల కొడుకు రోషన్ కూడా ‘బబుల్ గమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందు పలు ఫంక్షన్లలో కనిపించిన రాజీవ్ కనకాల గతంలో కంటే బాగా లావైనట్లు కనిపించారు. 

click me!