బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి..

Published : Jan 05, 2024, 02:33 PM IST
బోరున ఏడ్చిన హీరో సూర్య, విజయ్ కాంత్ కు స్టార్ హీరో నివాళి..

సారాంశం

దివంగత స్టార్ నటుడు, డిఎండీకె అధినేత  విజయ్ కాంత్ కు  తమిళ హీరో సూర్య నివాళి అర్పించారు. ఆయన్ను తలుచుకుని బోరున విలపించారు. 

హీరో సూర్య బోరున విలపించారు. తన అభిమాన  నటుడు, నాయకుడు విజయ్ కాంత్ ను తలుచుకుని ఆయన కన్నీరు మున్నీరు అయ్యారు. తాజాగా ఆయన విజయ్ కాంత్ సమాధిని సందర్శించారు. విజయ్ కాంత్ సమాధి వద్ద నేలపై కూర్చున్న సూర్య.. విజయ్ కాంత్ ను తలుచుకుని కన్నీరు మున్నీరు అయ్యారు. ఆయన అలా ఏడవడం చూసి..అభిమానులు కూడా ఎమోషనల్ అయ్యారు. 

ఇక విజయకాంత్ మరణించిన సమయంలో హీరో  సూర్య విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలకు హాజరుకాలేకపోయారు. నిన్న నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని చెన్నైకి తిరిగి వచ్చిన సూర్య.. ఈరోజు( జనవరి 5) ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని కోయంబత్తూరులోని విజయకాంత్ స్మారకం వద్దకు వచ్చి నివాళులర్పించారు. ఆ తర్వాత విజయకాంత్ గురించి మాట్లాడటం ప్రారంభించిన సూర్య కంటతడి పెట్టి ఆయనతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

తమది సొంత అన్నదమ్ముల బంధం అని అన్నారు సూర్య. ఇలా అన్నయ్య వెళ్లిపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. కెరీర్ బిగినింగ్ లో ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియని రోజుల్లో ఆయనతో  4, 5 సినిమాల్లో నటించాన్నారు సూర్య. 

 

అయితే పెరియన్న షూటింగ్ సమయంలో మా అన్నయ్యతో దగ్గరయ్యే అవకాశం వచ్చింది. ఆ సమయంలో నేను ఉపవాసం ఉండి నాన్ వేజ్ ముట్టుకోలేదు.. అప్పుడు ఆయన ఓ రోజు ఫోన్ చేసి ఈ వయసులో నాన్ వెజ్ తినకపోతే ఎలా.. తినాలి.. అని షూటింగ్ టైమ్ లో తాను తినేప్పుడు తన  ప్లేట్ లోంచి తీసి తినిపించాడు. అంత ప్రేమగా ఉండేవారు అని అన్నారు సూర్య. 

 

అంతే కాదు అన్నయ్యను చివరి చూపు చూసుకోలేకపోవడం బాధగా ఉంది.. కాని అన్న ఆశయాల కోసం తప్పకుండా పనిచేస్తాం. సినిమాల్లో కాదు.. రియల్ హీరోగా ఆయన దైర్య సాహసాలు మర్చిపోలేనివి.. సినీపరిశ్రమకు.. రాజకీయాలకు ఆయన చేసిన సేవ గుర్తుంచోదగినది. అందుకే తమిళ నటీనటుల సంఘం భవనానికి విజయ్ కాంత్ పేరు పెట్టాలని ఆయన సూచించారు. ఇక సూర్య బోరున విలిపిస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?