కూతురు పెళ్ళికి కట్నంగా ప్రభు ఎంత ఇచ్చారో తెలుసా.. దిమ్మతిరిగే వివరాలు వైరల్ 

Published : Dec 17, 2023, 05:04 PM ISTUpdated : Dec 17, 2023, 05:06 PM IST
కూతురు పెళ్ళికి కట్నంగా ప్రభు ఎంత ఇచ్చారో తెలుసా.. దిమ్మతిరిగే వివరాలు వైరల్ 

సారాంశం

ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం శుక్రవారం రోజు చెన్నై లో ఘనంగా జరిగింది. మార్క్ ఆంటోని చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ తో ఆమె వివాహం వైభవంగా జరిగింది.

ప్రముఖ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం శుక్రవారం రోజు చెన్నై లో ఘనంగా జరిగింది. మార్క్ ఆంటోని చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన అధిక్ రవిచంద్రన్ తో ఆమె వివాహం వైభవంగా జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో విశాల్, మణిరత్నం, దుల్కర్ సల్మాన్, ఖుష్బూ లాంటి ప్రముఖులంతా హాజరై వధూవరులని ఆశీర్వదించారు. 

ప్రభు కుమార్తె ఐశ్వర్యకి ఇది రెండవ వివాహం. గతంలో ఆమెకు ప్రభు సోదరి కుమారుడు కునాల్ తో వివాహం జరిగింది. కునాల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లండన్ లో పని చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఐశ్వర్య, కునాల్ లండన్ లో సెటిల్ అయ్యారు. కానీ ఈ జంట మధ్య విభేదాలు రావడంతో విడాకులతో విడిపోయారు. 

విడాకుల తర్వాత ఐశ్వర్య ఇండియాలో సొంతంగా వ్యాపారం మొదలు పెట్టింది. ఇంతలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో పరిచయం ఏర్పడడం అది ప్రేమగా మారడం జరిగింది. అధిక్ రవిచంద్రన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. విశాల్ తో తెరకెక్కించిన మార్క్ ఆంటోని చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. 

ప్రస్తుతం అధిక్.. స్టార్ హీరో అజిత్ తో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. తన కెరీర్ లో అతిపెద్ద చిత్రం రూపొందిస్తున్న సమయంలోనే ఆధిక్, ఐశ్వర్య లకు వివాహం జరిగింది. అయితే వీళ్లిద్దరి వయసు గురించి కూడా కోలివుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అధిక్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. ఆమె వయసు 34 కాగా అధిక్ వయసు 32 ఏళ్ళు. కొత్తగా జీవితం మొదలు పెట్టిన జంటకి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

అయితే కూతురి పెళ్ళికి నటుడు ప్రభు ఇచ్చిన కట్నం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రభు.. అధిక్ రవిచంద్రన్ కి కోటి రూపాయల కట్నం తో పాటు విలాసవంతమైన బంగ్లాని కట్నం రూపంలో ఇచ్చారట. అదేసమయంలో ఎంతో విలువైన బంగారు ఆభరణాలు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

సంక్రాంతి సినిమాల రేసులో ట్విస్ట్, ఆడియన్స్ కు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏంటో తెలుసా?
Gunde Ninda Gudi Gantalu Today:తల్లికి ఎదురు తిరిగిన మనోజ్.. షాక్ లో ప్రభావతి, మనోజ్ చెంపలు వాయించిన బామ్మ