కృష్ణను తలుచుకుంటూ భావోద్వేగం.. అలా చూసి తట్టుకోలేకపోయానంటూ నరేష్ ఎమోషనల్

By Asianet News  |  First Published May 16, 2023, 6:39 PM IST

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) తుదిశ్వాస విడిచి ఆరునెలలు గడిచిపోయింది. ఆయన లేరనే చేధు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా నటుడు నరేష్ ఓ షోలో భావోద్వేగమయ్యారు. 
 


సాహసాల వీరుడు సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే.  ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. ఇక గతేడాది కృష్ణ అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. 2022 నవంబర్ 15న తుదిశ్వాస విడిచారు. నేటికీ సరిగ్గా ఆయన ఈలోకాన్ని వదిలెల్లి సరిగ్గా 6 నెలలు గడిచింది. ఇప్పటికీ కుటుంబ సభ్యులు, అభిమానులు కృష్ణ గారిని మరిచిపోలేకపోతున్నారు. 

తాజాగా సీనియర్ నటి, దివంగత విజయ నిర్మల కొడుకు నటుడు నరేష్ ఓ షోలో భావోద్వేగం అయ్యారు. కృష్ణ, విజయ నిర్మల, ఇందిరా దేవిని తలుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లతో వారిని గుర్తు చేసుకున్నారు. నరేష్ మాట్లాడుతూ.. కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. నన్ను బాగా చూసుకునేవారు. అమ్మ, ఆయన ఎక్కడికైనా కలిసే వెళ్లే వారు. కానీ అమ్మవెళ్లిపోవడంతో ఒక కూర్చీ ఖాళీ అయ్యింది. ఆయనలో అమ్మను చూసుకునే వాడిని. కానీ ఇద్దరు వెళ్లిపోవడం తట్టుకోలేపోతున్నాను. అంటూ ఎమోషనల్ అయ్యారు. 

Latest Videos

దీంతో నరేష్ ను పక్కనే ఉన్న పవిత్రా లోకేష్ ఓదార్చింది. గతంలోనూ కృష్ణ మరణంపై నరేష్ పలుమార్లు ఎమోషనల్ అయ్యారు. అంత్యక్రియల సమయంలోనూ అన్నీ పనుల్లో తనవంతు బాధ్యతను నిర్వహించారు. ప్రస్తుతం వారి జ్ఞాపకార్థంగా విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై మళ్లీ సినిమాలను నిర్మిస్తున్నారు. 

ఈ క్రమంలో Malli Pelli అనే  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మూవీ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకొంది. మే26న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నరేష్, పవిత్రా జంటగా సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా లేట్ వయస్సులోనూ తమది స్వచ్చమైన ప్రేమను చాటుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ఇక మళ్లీ పెళ్లికి సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. 

click me!