ఐశ్వర్య రాజేష్ ఇంటికి బద్రత పెంపు.. వివాదాల్లో తమిళ నటి

Published : May 16, 2023, 06:38 PM IST
ఐశ్వర్య రాజేష్ ఇంటికి బద్రత పెంపు.. వివాదాల్లో తమిళ నటి

సారాంశం

తమిళ నటి.. తెలుగు పిల్ల ఐశ్వర్యా రాజేష్ ఇంటికి బద్రతను కట్టుదిట్టం చేశారు చెన్నై పోలీసులు. ఆమెపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం రావడంతో.. బద్రతను పెంచారు. అసలింతకీ ఏమయ్యింది..? ఏంటి సంగతి..?   


తెలుగు అమ్మాయి.. తమిళ సినిమాల్లో వెలుగు వెలుగుతుంది ఐశ్వర్య రాజేష్.  పాత తరం హీరో రాజేష్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఐశ్వర్య. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సోంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ.. హీరోయిన్ గా.. స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక స్థానం సంపాధింకుకుంది బ్యూటీ. ఇక తాజాగా ఆమె  ఓ వివాదంలో చిక్కుున్నట్టు తెలుస్తోంది. 

తమిళ దర్శకుడు నెల్సన్‌ వెంకటేష్‌ రూపొందించిన ఫర్హానా సినిమా వివాదంలో చిక్కుకుంది. ఓ వర్గాన్ని కించపరిచేలా సినిమా ఉందంటూ తమిళనాట వివాదం చెలరేగింది.  ఈ నేపథ్యంలోనే సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య రాజేష్‌ ఇబ్బందుల్లో పడ్డట్టయింది. ఆమెపై ఎప్పుడైనా దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో.. ఐశ్వర్య రాజేష్‌ ఇంటి వద్ద పోలీసుల భద్రత ఏర్పాటైంది. కొంతమంది పోలీసులు ఆమె ఇంటి వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పికెటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 

ఫర్హానా సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ ముస్లిం యువతిగా నటించారు. బుర్ఖా వేసుకున్న ఈ యంగ్ లేడీ.. ప్రపంచం అంతా తిరుగుతూ.. వేశ్య వృత్తి చేసే మహిళగా ఆమె కనిపించింది. దాంతో సినిమా వివాదంలో చిక్కుకుంది. సదరు వర్గం ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక ఫర్హానా సినిమా గురించి రీసెంట్ గానే క్లారిటీ ఇచ్చారు ఈమూవీ దర్శకుడు..  సినిమా టీం ప్రెస్ మీట్ లో  మాట్లాడుతూ.. కొంతమంది మాత్రమే ఫర్హానా సినిమాపై వివాదం చేస్తున్నారు. అసలు సెన్సార్ బోర్డ్ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఇప్పుడు సినిమాపై వివాదం చేయడం ఎందుకు..? అసలు  మా సినిమా ఏ మతానికి.. నమ్మకాలకు వ్యతిరేకం కాదు. ఒక మంచి సినిమా చేయాలి అనుకున్నాము చేశాము..  మంచి సినిమా చేయాలన్నదే మా.. ఆలోచన, మా లక్ష్యం అన్నారు. 

ఎవరినో కించపరచాలని.. ఓ మతానికి వ్యతిరేకంగా మేము ఎప్పుడూ సినిమాలు చేయడం లేదు. మంచి చెప్పాలన్నది మా లక్ష్యం. మానవత్వాన్ని చాటాలన్నదే మా ప్రయత్నం. అంటూ.. సినిమా టీమ్ వివరణ కూడా ఇచ్చారు. ఇక మే 12న రిలీజ్ అయిన ఈసినిమాలో దర్శకుడు, నటుడు,  సెల్వరాఘవన్‌ తో పాటుగా ఐశ్వర్య దత్త,  జితిన్‌ రమేష్‌ తదితరులు కీలక పాత్రలో నటించారు. అటు కేరళలో కూడా  అదాశర్మ నటించిన ది కేరళ స్టోరీ సినిమా కూడా ఇలాగే వివాదాల్లో.. చిక్కుంది. 
 

PREV
click me!

Recommended Stories

తేజ తర్వాత సుమన్ శెట్టి దేవుడిలా కొలిచే తెలుగు హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
ఇదెక్కడి ట్విస్ట్ బాబూ.! నాగచైతన్యతో సమంత, శోభిత.. అసలు మ్యాటర్ ఇది