`రేసు గుర్రం` విలన్‌కి కాస్టింగ్‌ కౌచ్‌ వేధింపులు.. కాఫీకి రమ్మంటూ ఒత్తిడి, ఆయన ఏం చేశాడంటే?

Published : Jun 13, 2025, 10:51 PM IST
ravi kishan vs manoj tiwari

సారాంశం

సినిమా రంగంలో హీరోయిన్లు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మాట్లాడారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. కానీ ఒక హీరో తనకు ఎదురైన కాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓపెన్‌ అయి షాకిచ్చాడు. ఆయనే ఎంపీ, నటుడు రవికిషన్‌.  

భోజ్‌పురిలో స్టార్‌ హీరోగా రాణించిన నటుడు రవికిషన్.. అల్లు అర్జున్‌ నటించిన `రేసుగుర్రం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఆయనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత తెలుగులో విలన్‌గా బిజీ అయ్యారు. వరుసగా ఆఫర్లు అందుకున్నారు. చివరగా ఆయన `డాకు మహారాజ్‌`లోనూ నటించి మెప్పించారు. 

మరోవైపు కన్నడ, తమిళం,  హిందీ, భోజ్‌పురిలోనూ సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. రాజకీయాలు, సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న రవికిషన్‌ ఓ షాకింగ్‌ విషయాన్ని వెల్లడించారు. కాస్టింగ్‌ కౌచ్ ని బయటపెట్టాడు.  సినీ రంగంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మహిళలకే కాదు, పురుషులకు కూడా జరుగుతుందనే షాకింగ్ విషయాన్ని ఆయన ఇటీవల వెల్లడించారు. 

సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌ దుమారం 

ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. రజత్ శర్మతో జరిగిన ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో రవి కిషన్ తనపై జరిగిన క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. నటీమణులకు దర్శకులు, నిర్మాతలు వంటి సినీ ప్రముఖుల నుండి వేధింపులు ఎలా ఉంటాయో, అదే విధంగా మహిళల నుండి కూడా వేధింపులు తక్కువేమీ కాదని ఆయన అన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ అనేది కొన్ని సంవత్సరాలుగా సినీ రంగంలో చాలా చర్చనీయాంశం. 2018లో నటి శృతి హరిహరన్ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఆ తర్వాత `మీ టూ` ఉద్యమం మొదలైంది. అప్పటి నుండి చాలా మంది నటీమణులు ముందుకు వచ్చి తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పారు. 

ఆడవారికే కాదు మగవాళ్లుపై కూడా కాస్టింగ్‌ కౌచ్‌

అప్పటి నుండి మీ టూ, క్యాస్టింగ్ కౌచ్ అనేవి పెద్ద సమస్యగా మారాయి. సినీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల్లోని మహిళలు కూడా ఈ విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. క్రమంగా ఈ విషయంపై అంతా సైలెంట్‌ అయ్యారు. కానీ క్యాస్టింగ్ కౌచ్, మీ టూ అంటే మహిళలపై జరిగే లైంగిక వేధింపులే అని అందరూ అనుకుంటారు. 

కానీ అది నిజం కాదు. పురుషులపై కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ప్రముఖ నటుడు, 'ఉదరియాన్' హిందీ సీరియల్ ద్వారా సూపర్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు అంకిత్ గుప్తా తన చేదు అనుభవాలను వెల్లడించారు. హిందీ 'బిగ్ బాస్ 16'లో పాల్గొన్న అంకిత్ ఒక మహిళ నుండి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

తనకు ఎదురైన వేధింపులు బయటపెట్టిన రవికిషన్‌ 

ఆమె ఎవరో నేను చెప్పను, కానీ ఏం జరిగిందో మాత్రం చెబుతాను అంటూ రవి కిషన్ ఆ చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడ్డానో కూడా వివరించారు. 'ఆమె ఎవరో నేను చెప్పను, పేరు చెప్పడం ఇష్టం లేదు. కానీ ఆ రోజు రాత్రి కాఫీ తాగుదామని పిలిచారు. రాత్రి కలుద్దామన్నారు. ఆమె పిలిచిన తీరు నాకు సరిగ్గా అనిపించలేదు. ఏదో ప్రమాదం పొంచి ఉందని అనిపించింది' అని రవి కిషన్ అన్నారు.

ఇప్పుడు ఆమె చాలా పెద్ద పేరు సంపాదించుకుంది. కానీ ఆ రోజు రాత్రి ఒక కప్పు కాఫీ కోసం పిలిచిన విషయం నేను ఇప్పటికీ మర్చిపోలేను అని అన్నారు. పగటిపూట తినడానికి పిలవడం నాకు తెలుసు. రాత్రిపూట కూడా కొన్నిసార్లు తిండి, పానీయాలకు ఆహ్వానిస్తారు. కానీ ఆమె రాత్రిపూట కాఫీ తాగడానికి పిలవడంతో నాకు అనుమానం వచ్చింది. 

ఇలా ఆహ్వానించడానికి ముందు ఆమె తన గురించి, తన తండ్రి గురించి గొప్పగా చెప్పుకుంది. తన తండ్రి ఎంతటి ప్రతిభావంతుడో చెప్పింది. నేను ఆకట్టుకున్నాను. కానీ చివరికి తెలిసింది ఏమిటంటే, ఆమె ఉద్దేశం వేరే అని రవి కిషన్ అన్నారు. నేను వెంటనే ఆమె ఆహ్వానాన్ని తిరస్కరించాను. ఎంత బలవంతం చేసినా రాత్రిపూట వెళ్ళలేదు` అని అన్నారు.

 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్