‘భళా తందనాన’ అనటానికి రాజమౌళి వచ్చాడు

Surya Prakash   | Asianet News
Published : Apr 07, 2021, 08:18 AM IST
‘భళా తందనాన’ అనటానికి రాజమౌళి వచ్చాడు

సారాంశం

శ్రీ విష్ణు  'భళా తందనాన' టైటిల్ తో ఓ ఫిల్మ్ ప్రారంభించారు. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

యంగ్ హీరో శ్రీవిష్ణు వరస ప్రాజెక్టులతో బిజీ అవుతున్నాయి. హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా దూసుకుపోతున్నాడు.ఈ సంవత్సరం ఆల్రెడీ గాలి సంపత్ తో  పలకరించాడు. కానీ అది డిజాస్టర్ అయ్యింది. దాంతో ఈ ప్లాఫ్ ని మరిపించే హిట్ కొట్టాలని వరస ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నాడు. తాజాగా  శ్రీ విష్ణు  'భళా తందనాన' టైటిల్ తో ఓ ఫిల్మ్ ప్రారంభించారు. 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి దర్శకత్వంలో వైవిధ్యమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.  

వివరాల్లోకి వెళితే... శ్రీ విష్ణు హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఓ సినిమా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘భళా తందనాన’ అనే పేరు ఖరారు చేశారు. కేథరిన్‌ హీరోయిన్. చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందనుంది. హైదరాబాద్‌లో మంగళవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్‌ క్లాప్‌ కొట్టగా.. దర్శకుడు రాజమౌళి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. వల్లి, రమ చిత్ర టీమ్ కి స్క్రిప్టుని అందజేశారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

 మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలవుతుంది. 'కెజిఎఫ్‌' చిత్రంలో గరుడగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన రామచంద్రరాజు విలన్‌ పాత్ర పోషిస్తున్నాడు.  'భళా తందనాన' చిత్రంలో శ్రీ విష్ణు ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలో కనిపించనున్నాడని చెప్తున్నారు. 'బాణం' 'బసంతి' సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న చైతన్య దంతులూరి.. ఆశ్చర్యపరిచే స్క్రిప్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి శ్రీకాంత్ విస్సా రచన చేస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేయనున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నారు. కెరీర్ ఆరంభం నుంచి విభిన్నమైన చిత్రాల్లో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ వస్తున్న శ్రీవిష్ణు కు.. ''భళా తందనాన'' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాల్సిందే.

PREV
click me!

Recommended Stories

Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్
Gunde Ninda Gudi Gantalu: మనోజ్ కి నడిచొచ్చే కొడుకు.. రోహిణీ గతం బయటపడుతుందా? బాలుకి అబద్ధం చెప్పిన మీనా