ఆనందయ్య మందు తీసుకున్నా.. నాకు కరోనా రాలేదుః జగపతిబాబు

Published : Jun 07, 2021, 07:40 PM IST
ఆనందయ్య మందు తీసుకున్నా.. నాకు కరోనా రాలేదుః జగపతిబాబు

సారాంశం

ఆనందయ్య మందుని తాను ఇప్పటికే తీసుకున్నానని, తనకు ఇప్పటి వరకు ఎలాంటి కరోనా రాలేదని చెబుతున్నారు నటుడు జగపతిబాబు. నెల్లూరులోని కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య మందు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 

ఆనందయ్య మందుని తాను ఇప్పటికే తీసుకున్నానని, తనకు ఇప్పటి వరకు ఎలాంటి కరోనా రాలేదని చెబుతున్నారు నటుడు జగపతిబాబు. నెల్లూరులోని కృష్ణపట్నంకి చెందిన ఆనందయ్య మందు విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కరోనాకి ఆనందయ్య అందించే పసరు మందు బాగా పనిచేస్తుందని ప్రచారం జరుగుతోంది. హైకోర్ట్ కూడా ఈ మందుకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నచ్చిన వాళ్లు ఈ మందుని తీసుకోవచ్చని తెలిపింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ మందు అందించేందుకు సహకరించాల్సి వస్తోంది. 

సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దీనిపై నటుడు జగపతిబాబు స్పందించారు. తాను ఈ మందుని తీసుకున్నట్టు తెలిపారు. ఆయన మాట్లాడుతూ, `ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో నేను కూడా ఒకడిని. ఆయుర్వేద తప్పు చేయదని నా నమ్మకం. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ఎలాంటి దుష్ప్రభావాలు లేవని తెలుసుకున్న తర్వాతే అంతా మంచే జరుగుతుందనే నమ్మకంతో డోస్‌ తీసుకున్నా. ఇప్పటివరకూ నాకెలాంటి కరోనా రాలేదు` అని జగపతిబాబు తెలిపారు. 

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో, వరుసగా ఆఫర్లతో దూసుకుపోతున్నారు జగపతిబాబు. ప్రస్తుతం ఆయన నాని చిత్రం `టక్‌ జగదీష్‌`, `రిపబ్లిక్‌`, `గుడ్‌లక్‌ సఖీ`, `గని`, `పుష్ప`, `మహాసముద్రం`, `లక్ష్యా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌