ఎవరి లైఫ్‌ వాళ్లే క్రియేట్‌ చేసుకోవాలి.. క్యాన్సర్‌ రోజులు గుర్తుచేసుకుంటూ సోనాలీ బింద్రే ఎమోషనల్‌

Published : Jun 07, 2021, 06:12 PM IST
ఎవరి లైఫ్‌ వాళ్లే క్రియేట్‌ చేసుకోవాలి.. క్యాన్సర్‌ రోజులు గుర్తుచేసుకుంటూ సోనాలీ బింద్రే ఎమోషనల్‌

సారాంశం

సోనాలి లేటెస్ట్ ఫోటోకి క్యాన్సర్‌తో బాధపడుతున్ననాటి మరో ఫోటోని జత చేసింది అభిమానులతో పంచుకుంది. ఇందులో ఎమోషనల్‌ నోట్‌ పేర్కొంది. పలు ఇన్ స్పైరింగ్‌ విషయాలను తెలిపింది.   

సోనాలి బింద్రే ఎమోషనల్‌ అయ్యింది. క్యాన్సర్‌ నాటి భయానక రోజులు తలచుకుని భావోద్వేగానికి గురయ్యింది. క్యాన్సర్‌ తర్వాత తన జీవితం ఎలా ఉంటుందో చెప్పలేనిదని పేర్కొంది. ఈ మేరకు సోనాలి లేటెస్ట్ ఫోటోకి క్యాన్సర్‌తో బాధపడుతున్ననాటి మరో ఫోటోని జత చేసింది అభిమానులతో పంచుకుంది. ఇందులో ఎమోషనల్‌ నోట్‌ పేర్కొంది. పలు ఇన్ స్పైరింగ్‌ విషయాలను తెలిపింది. 

`కాలం ఎంత‌ తొందరగా పరుగులు తీస్తోంది. గతానికి సంబంధించిన రోజులను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ టైమ్లో నేను ఎంత వీక్‌గా ఉన్నానో తలచుకుంటూనే ఆశ్చర్యమేస్తుంది. సి పదం(క్యాన్సర్) తర్వాత నా జీవితం ఎలా ఉందనే విషయాన్ని నిర్వచించలేనిది. అది నిజం‍గా నా జీవితంలో భయానక చేదు జ్ఞాపకం. అందుకే ఎవరి జీవితాన్ని వారే ఎంపిక చేసుకోవాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే మీ లైఫ్‌ జర్నీ అలా కొనసాగుతుంది` అని పేర్కొంది. 

సోనాలి బింద్రే మూడేళ్ల క్రితం క్యాన్సర్‌ బారిన పడిన విషయం తెలిసిందే. అమెరికాలో ఆమె చికిత్స పొందారు. చికిత్స అనంతరం విజయవంతంగా క్యాన్సర్‌ నుంచి కోలుకున్నారు. అయితే ఎంతో అందంగా కనిపించే సోనాలిని ఒక్కసారిగా గుండుతో చూడటంతో అభిమానులు షాక్‌ అయ్యారు. ఇప్పుడామె తిరిగి నార్మల్‌ స్థితికి చేరుకున్నారు. ఆ విషయాన్ని చెబుతూ, ఆ నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తాజాగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు. 

మహేష్‌ నటించిన `మురారి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సోనాలీ తొలి చిత్రంతోనే సక్సెస్‌ని అందుకుంది. చిరంజీవితో `ఇంద్ర` `శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌`, శ్రీకాంత్‌తో `ఖడ్గం`, నాగార్జునతో `మన్మథుడు`, బాలకృష్ణతో `పల్నాటి బ్రహ్మానాయుడు` చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు హిందీలో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. మ్యారేజ్‌ చేసుకుని 2013 తర్వాత సినిమాలకు దూరమైంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే