షాకింగ్: మరో దిగ్గజాన్ని కోల్పోయిన సినీ పరిశ్రమ

By Satish ReddyFirst Published Jun 21, 2020, 10:37 AM IST
Highlights

లార్డ్ ఆఫ్‌ ద రింగ్స్‌, ఎలిన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇయాన్ వయసు 88 సంవత్సరాలు. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన ఇయాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్నాడు. 1981లో రూపొందించిన చారియట్స్ ఆఫ్ ఫైర్ సినిమాలో ఆయన పోషించిన కోచ్ పాత్రకు గాను ఆయన ఆస్కార్ కు నామినేట్‌ అయ్యాడు.

వరుస విషాదాలు సినీ పరిశ్రమను వెంటాడుతున్నాయి. లెజెండరీ నటులతో పాటు యువ నటులు కూడా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ హాలీవుడ్ సీనియర్ నటుడు ఇయాన్‌ హోల్మ్‌ మరణ వార్త సినీ అభిమానులకు మరో షాక్ ఇచ్చింది. కొంతకాలంగా పార్కిన్సన్‌ వ్యాదితో బాధపడుతున్న ఇయాన్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టుగా ఆయన కుటుంబీకులు వెళ్లడించారు.

లార్డ్ ఆఫ్‌ ద రింగ్స్‌, ఎలిన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఇయాన్ వయసు 88 సంవత్సరాలు. ఆస్కార్‌కు కూడా నామినేట్ అయిన ఇయాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంత చేసుకున్నాడు. 1981లో రూపొందించిన చారియట్స్ ఆఫ్ ఫైర్ సినిమాలో ఆయన పోషించిన కోచ్ పాత్రకు గాను ఆయన ఆస్కార్ కు నామినేట్‌ అయ్యాడు. అంతేకాదు బెఫెటా, కేన్స్‌ లాంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ ఆయన అరుదైన గౌరవాలను పొందాడు.

హాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి ఏలియన్‌ మూవీ లో విలన్‌గా నటించాడు ఇయాన్‌ అంతేకాదు ప్రతిష్టాత్మక మ్యాడ్‌ నెస్‌ ఆఫ్ కింగ్ జార్జ్‌, ది ఏవియేటర్ సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్రల్లో నటించాడు. నటుడిగా ఎన్నో అద్బుత విజయాలు అందుకున్న ఇయాన్ కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రశాంతంగా కన్నుమూసినట్టుగా ఆయన పీఆర్‌ తెలిపారు. ఆయన మృతికి హాలీవుడ్‌ ప్రముఖులతో పాటు పలు నిర్మాణ సంస్థలు నివాళి అర్పించాయి.

click me!