సర్జరీ చేయించుకుని `ఖిలాడీ` షూటింగ్‌లో పాల్గొన్న నటుడు.. ప్రశంసలు

Published : Aug 17, 2021, 07:14 PM IST
సర్జరీ చేయించుకుని `ఖిలాడీ` షూటింగ్‌లో పాల్గొన్న నటుడు.. ప్రశంసలు

సారాంశం

విలన్‌ పాత్రలతో పాపులర్ అయిన అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తన ప్రొఫేషనల్‌ స్కిల్ ని చాటుకున్నారు. వర్క్ పట్ల ఎంత డెడికేషన్‌తో ఉన్నాడనే విషయాన్ని చాటుకున్నారు. ఇప్పుడు అందరి ప్రశంసలందుకుంటున్నారు.

నటుడు అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ విలన్‌గా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైన విషయం తెలిసిందే. ఆయన తెలుగులో బన్నీ నటించిన `నాపేరుసూర్య నా ఇల్లు ఇండియా`, సాయిధరమ్‌ తేజ్‌ `విన్నర్‌`, అలాగే సూర్య నటించిన `సింగం3`లో నటించి ఆకట్టుకున్నారు.  ప్రస్తుతం ఆయన రవితేజ హీరోగా రూపొందుతున్న `ఖిలాడి` చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల అనూప్‌కు తీవ్ర కడుపు నొప్పి రావడంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్స్ అతనికి వెంటనే అపెండిక్స్ ఆపరేషన్ చేయాలని సూచించారు. 

డాక్టర్లు చెప్పినట్లుగానే ఆయన వెంటనే సర్జరీ చేయించుకున్నారు. కానీ సర్జరీ అయిన వెంటనే ప్రస్తుతం ఆయన నటిస్తోన్న రవితేజ `ఖిలాడి` సినిమా చిత్రయూనిట్ నుండి పిలుపు వచ్చింది. అతను పూర్తి చేయాల్సిన షూట్ ఇంకా మిగిలి ఉందని, వెంటనే షూట్‌లో జాయిన్ కావాలని యూనిట్ నుంచి కాల్ రావడంతో.. సర్జరీ అయి, డాక్టర్స్ రెస్ట్ తీసుకోమని చెప్పినా ఇతర నటీనటులతో కాంబినేషన్ సీన్స్ ఉండడం, వారికి డేట్స్ ఇబ్బంది కలుగుతుందని భావించి.. వెంటనే ఆయన హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొని, అతని పార్ట్ పూర్తి చేశారు. 

దీంతో అనూప్ డెడికేషన్‌పై చిత్రయూనిట్ ప్రశంసల వర్షం కురిపించింది. `ఖిలాడి` చిత్రంలో అనూప్ డేవిడ్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం అనూప్ ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. అందరి ప్రేమాభిమానాలు, సంకల్పం వల్లే తాను చేయగలిగానని, ఆరోగ్యం పరంగా ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు అనూప్‌ సింగ్‌. అనూప్‌పై నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్