కరోనాతో ఐసీయూలో నటుడు అనిరుధ్‌ దేవ్‌..

Published : May 01, 2021, 04:23 PM IST
కరోనాతో ఐసీయూలో నటుడు అనిరుధ్‌ దేవ్‌..

సారాంశం

తాజాగా మరో నటుడు కరోనాతో ఐసీయూలో చేరారు. హిందీకి చెందిన నటుడు అనిరుధ్‌ దేవ్‌కి గత వారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింతగా విస్తరిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. తాజాగా మరో నటుడు కరోనాతో ఐసీయూలో చేరారు. హిందీకి చెందిన నటుడు అనిరుధ్‌ దేవ్‌కి గత వారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారట. ఆయన ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని మారిందని తెలుస్తుంది. 

అయితే ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి అంటూ నటి ఆషా చౌదరి తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులను అభ్యర్థించింది. ఇటీవల భోపాల్‌లో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ సమయంలో అనిరుధ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వెంటనే ఆయన్ని ప్రత్యేక వాహనంలో ముంబయి తీసుకొచ్చి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో ఐసీయూలోకి మార్చి ట్రీట్‌మెంట్‌ అందిస్తున్నారు. 

సినిమా, టీవీ నటుడిగా రాణిస్తున్న అనిరుధ్‌ దేవ్‌ `తెరీ సాంగ్‌`, `షార్‌గల్‌`, `ప్రాణం` చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌ హీరోగా రూపొందుతున్న `బేల్ బాటమ్‌`లో నటిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌లో అమీర్‌ ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అక్షయ్‌ కుమార్‌, అలియా భట్‌, అనుపమ్‌ ఖేర్‌, కార్తీక్‌ ఆర్యన్‌ వంటి వారికి కరోనా సోకిన విషయం తెలిసిందే. వారు వైరస్‌ నుంచి కోలుకున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు
Ileana: ప్రభాస్‌, మహేష్‌, తారక్‌, రవితేజ గురించి ఇలియానా ఒక్క మాటలో