Peter Hein : హీరోగా ‘బాహుబలి’ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఎంట్రీ.. డిటెయిల్స్!

Published : Jan 06, 2024, 10:23 AM IST
Peter Hein : హీరోగా ‘బాహుబలి’ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్ ఎంట్రీ.. డిటెయిల్స్!

సారాంశం

ప్రముఖ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటెర్ హెయిన్ Peter Hein ఇప్పుడు హీరోగా అలరించబోతున్నారు. ఇన్నాళ్లు యాక్షన్ తో ఇరగదీసిన స్టంట్ మాస్టర్ ఇప్పుడు తన నటనతో అలరించబోతున్నారని తెలుస్తోంది.   

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆయా డిపార్ట్ మెంట్లలో ఉన్న సీనియర్లు వెండితెరపై మెరవాలని ఆశిస్తున్నారు. ఈ వరుసలో తెరవెనుక పనిచేసి తెరమీదకు వచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ (Action Choreographer)  పీటెర్ హెయిన్ కూడా హీరోగా మారబోతున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఎన్నో చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన ఆయన కథనాయకుడిగా ఓ సినిమా రాబోతోంది. 

డెబ్యూ దర్శకుడు మా వెట్రీ Maa Vetri డైరెక్షన్ లో రాబోతున్న చిత్రంలో లీడ్ రోల్ లో నటించనున్నారని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ మూవీ పూర్తిగా భారీ యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే పీటెర్ హెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ట్రెండ్స్ సినిమాస్ అధినేత జేఎం బషీర్, యంటీ సినిమాస్ అధినేత ఏఎం చౌదరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం సాయంత్రం చైన్నైలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతోనూ లాంఛనంగా ప్రారంభమైంది. 

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాల్లో పీటర్ హెయిన్ ఎలాంటి స్టంట్స్ ను కొరియోగ్రఫీని అందించారో చూశాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు హీరోగా అది కూడా పాన్ ఇండియా మూవీలో నటిస్తుండటంతో ఆసక్తికరంగా మారింది. మూవీ ఎలా ఉండబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. భారీ యాక్షన్ థ్రిల్లర్ తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటుండగా... ఇప్పుడు పీటర్ హెయిన్ తో ప్రారంభమైందని మేకర్స్ తెలిపారు. 

 

PREV
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర