కార్తీ సర్దార్ 2 సెట్స్ లో ఒకరు మృతి... ఏం జరిగిందంటే?

Published : Jul 17, 2024, 02:01 PM IST
కార్తీ సర్దార్ 2 సెట్స్ లో ఒకరు మృతి... ఏం జరిగిందంటే?

సారాంశం

కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో హీరో కార్తితో పాటు చిత్ర యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యారు.   

కార్తీ హీరోగా ఇటీవల సర్దార్ 2 ప్రకటించారు. పూజా కార్యక్రమాలతో మూవీ లాంచ్ చేశారు. జులై 15 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎజుమలై అనే ఫైటర్ 20 అడుగుల ఎత్తున నుండి క్రిందపడ్డాడు. ఎజుమలై ఛాతికి తీవ్ర గాయమైనట్లు తెలుస్తుంది. చికిత్స పొందుతూ ఫైటర్ కన్నుమూశాడు. ఈ ప్రమాదంలో మరొక ఇద్దరు ఫైటర్స్ కి కూడా గాయాలపాలయ్యారట. వారు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. 

ప్రమాదం జరిగినప్పుడు కార్తీ అక్కడే ఉన్నాడని సమాచారం. ఈ మధ్య తరచుగా షూటింగ్ సెట్స్ లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 2020లో భారతీయుడు 2 సెట్స్ లో క్రేన్ విరిగి పడి ముగ్గురు యువకులు కన్నుమూశారు. దేవర, కంగువ చిత్రాల చిత్రీకరణ సమయంలో కూడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలపై పరిశ్రమ దృష్టి సారించాల్సి ఉంది. 

2022లో విడుదలైన సర్దార్ చిత్రానికి సర్దార్ 2 సీక్వెల్. కార్తీ పోలీస్ అధికారిగా, సీక్రెట్ ఏజెంట్ గా రెండు భిన్నమైన పాత్రలు చేశాడు. సర్దార్ చిత్రానికి దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. ఎస్ జే సూర్య ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు