RRR రిలీజ్: ఈ లెక్కలు తేలితేనే,షూటింగ్ అయితే చాలదు

By Surya Prakash  |  First Published Jul 1, 2021, 4:05 PM IST

 ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.


ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి   ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ  చేస్తే దాన్ని అద్బుతంగా జనరంజకంగా రూపొందిస్తున్నారు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నారు.ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
 
  “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ ఆఖరి స్టేజికి చేరుకొంది. రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ రెండు పాటలు ఈ నెలలో తీస్తారు.   ఈ చిత్రం షూటింగ్ త్వరలో హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో షూటింగ్ పూర్తై పోతుంది కాబట్టి “ఆర్ ఆర్ ఆర్” ఈ ఏడాది అక్టోబర్ 31న ఖచ్చితంగా విడుదల అవుతుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అది సాధ్యం కాదంటున్నారు విశ్లేషకులు. అందుకు వారు చెప్పే రీజన్స్ క్రింద విధంగా ఉన్నాయి. 

“ఆర్ ఆర్ ఆర్” సినిమాని దాదాపు 12 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. వాటిల్లో తెలుగు, హిందీ, తమిళ్ కీలకం. హిందీ సినిమాలు అయితే ఈ నెలాఖరు నుంచి విడుదల కానున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన “బెల్ బాటమ్” జులై 27న విడుదల కానుంది. ఆ సినిమాకి హౌస్ ఫుల్స్ అయ్యి హిట్ అయితే మిగతా  బాలీవుడ్ పెద్ద సినిమాలు థియేటర్లలో దిగుతాయి. లేదంటే… ఇంకా లేటు అవుతుంది.

Latest Videos

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు .. “ఆర్ ఆర్ ఆర్” సినిమాని భారీ మొత్తాలకు పెన్ ఇండియా (హిందీ), లైకా (తమిళ్), ఫార్స్ (ఓవర్సీస్) సంస్థలకు అమ్మారు. ఈ మూడు సంస్థలే దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించాయి. అంటే థియేటర్ల నుంచి దాదాపు 600 కోట్ల రూపాయలు రావాలి. దాని అర్దం ఏమిటి...ఇండియా మొత్తం మార్కెట్ ఓపెన్ అయ్యితేనే అది సాధ్యం.

 కాబట్టి ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్నో లెక్కలు ఉన్నాయి. ఏ మాత్రం తేడా చేసినా మొత్తం డబ్బులు పోతాయి. కాబట్టి  షూటింగ్ పూర్తి అయ్యిందనో...తెలంగాణాలో లాక్డౌన్ ఎత్తేశారనో రిలీజ్ చెయ్యరు. “ఆర్ ఆర్ ఆర్” విడుదల తేదీ ఫిక్స్ చేయాలంటే ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ ఏడాది అక్టోబర్ 31న విడుదల కాకపోవచ్చు అనేది వారి విశ్లేషణ. 
   
  సినిమా విశేషాలకు వస్తే.. ఎన్టీఆర్ ఈ సినిమా గురించి ఓ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని తారక్ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చూస్తే.. ప్రేక్షకులు సీట్లో కూర్చోలేరంటూ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇక భారీ సెట్టింగ్ తో సినిమా మరోలా ఉంటుందని తెలిపాడు తారక్. 

 ఈ చిత్రంలో హాలీవుడ్.. బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్ న‌టిస్తున్నారు. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కూడా ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

click me!