తెలుగువారికీ వివేక్ ఫన్ ఇష్టం, ఆ సినిమాల్లో మరీను

By Surya PrakashFirst Published Apr 17, 2021, 8:44 AM IST
Highlights


తమిళ ప్రముఖ హాస్యనటుడు వివేక్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు ఇక్కడా డిమాండ్ ఉంది. కాబట్టి పెద్ద హీరోలంతా ఆయన లేనిదే సినిమా చేయటానికి ఓ టైమ్ లో ఇష్టపడలేదు.  

వివేక్‌ అకాల మరణం తమిళ,తెలుగు సినీ ప్రియులను విషాదంలో ముంచేసింది. పలువురు ప్రముఖులతో పాటు అభిమానులు ఆయన ఆత్మకు శాంతి కలగాలనీ కోరుకుంటున్నారు. తమిళ సినిమాలు వరసగా తెలుగులో డబ్బింగ్ అయ్యి సక్సెస్ అయ్యిన టైమ్ లో ఆయన ఇక్కడ వారికి కూడా అభిమాన నటుడు అయ్యిపోయారు. పోస్టర్స్ మీద ఆయన్ని ప్రత్యేకంగా వేసేవారు. ఎందుకంటే ఆయన కోసం కూడా సినిమాకు వెళ్లే తెలుగు వారు ఉంటారని డబ్బింగ్ నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ నమ్మేవారు.అది నిజం కూడా. 

వివేక్ ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ చిత్రంలో తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడని చెప్పాలి.  ఆ సినిమాలో బాయ్స్‌కు సాయం చేసే పాత్రలో ఆయన అలరించాడు. చాలా కాలం గుర్తిండిపోయారు.  ఆ తర్వాత అపరిచితుడులో హీరో విక్రమ్ స్నేహితుడుగా, రజనీ రజనీ శివాజీలో ఆయన మేనమామగా  ఫుల్ లెంగ్త్ పాత్రలో వివేక్ తన నటనతో నవ్వించాడు. , 'రఘు వరన్‌ బీటెక్‌'లో ధనుష్‌ సహచరుడిగా 'స్వర్ణపుష్పం' అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించారు. హీ‌రో సూర్యతో కలిసి 'సింగం 2'లో ఎస్‌ఐ పాత్రలో మెప్పించారు.  వివేక్ గొప్పతనం ఏమిటంటే కామెడీ కోసం ఎక్కడా వెకిలి వేషాలు వేసేవారు కాదు. అలాగే ఆయన కూడా హీరోలా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేవారు. ఆయన అందగాడు కావటం కూడా స్క్రీన్ ప్రెజన్స్ బాగుండేది అని పెద్ద పెద్ద దర్శకుడు మెచ్చుకునేవారు.

ఈ క్రమంలో  వివేక్ నటనకు తెలుగు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. తమిళంలో అయితే ఈయన టాప్ కమెడియన్ స్దాయికి ఎదిగారు. ఓ టైమ్ లో వివేక్ లేని తమిళ స్టార్ హీరో సినిమా లేదు. డిస్ట్రిబ్యూటర్స్ వివేక్ ఉన్నాడా అని అడిగేవారు.  తమిళనాట వడివేలు, సెంథిల్,గౌండ్రమణి  తర్వాత అంతటి ఇమేజ్, క్రేజ్ సంపాదించుకున్న నటుడు ఈయన మాత్రమే.  తమిళంలో దాదాపు 300 సినిమాలకు పైగానే నటించాడు వివేక్. దర్శక శిఖరం కె. బాలచందర్‌ పరిచయం చేసిన నటుల్లో వివేక్‌ కూడా ఒకరు. వివేక్ ‘మనదిల్‌ ఉరుది వేండం’ సినిమా ద్వారా ఈయన సినీ అరంగేట్రం చేశారు.  12 ఏళ్ల కింద అంటే 2009లోనే ఈయనకు కేంద్రం ప‌ద్మ‌ శ్రీ అవార్డ్‌తో సత్కరించింది. 

ఇక కొన్నేళ్ల కింద వివేక్ తల్లి, కొడుకు ప్రసన్న కుమార్ చనిపోయారు. వాళ్ల మరణం తర్వాత బాగా క్రుంగిపోయాడు వివేక్. అప్పట్నుంచి ఆరోగ్యం పై శ్రద్ద తగ్గింది. చాలా డిప్రెషన్ లో ఉన్న ఆయన  సినిమాలు చేయడంతోనే స్వాంతన పొందేవారు. ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని వరసపెట్టి ఏ సినిమా పడిదే అది.. మునపటిలా ఇప్పుడు సినిమాలు కూడా చేయడం లేదు. ఆయన ఇప్పుడిప్పుడే తన స్వీయ విషాదం నుంచి బయిటపడుతున్నారనుకనే సమయంలోనే అందరినీ విషాదంలో ముంచుతూ స్వర్గస్తులయ్యారు.

click me!