గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ మృతి

By team teluguFirst Published Apr 17, 2021, 7:06 AM IST
Highlights

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్  (59) కన్నుమూశారు.  ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన  నేటి ఉదయం 4 గంటలా 37 నిమిషాలకు మరణించినట్టు తెలిసింది.

ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్  (59) కన్నుమూశారు.  ఆసుపత్రి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆయన  నేటి ఉదయం 4 గంటలా 37 నిమిషాలకు మరణించినట్టు తెలిసింది. హార్ట్ ఎటాక్ తో ఆయన  నిన్న ఆసపత్రిలో ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అయ్యారు. ఆయనకు తీవ్ర ఛాతీ నొప్పి రావడంతో ఆయనను  శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని నిన్ననే ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడం కలకలం  రేపింది.

 అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.  నిన్నటి నుండి ఆయనకు ఎక్మో ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల టీమ్  ఆయన ప్రాణాన్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ... ఆయనను కాపాడలేకపోయినట్టు తెలిపారు. ఐసియులో చికిత్స పొందుతున్న వివేక్ గురువారమే కోవిడ్ కి వాక్సిన్ కూడా తీసుకున్నారు.   

కాగా చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా  వైద్యులు,  సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరూ ముందుకు వచ్చి కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని పిలుపు కూడా ఇచ్చారు వివేక్. కోవాక్సిన్ తో పాటు కోవీషీల్డ్ కూడా మనకు కోవిడ్ రాకుండా చేయలేనప్పటికీ... కోవిడ్ ప్రమాదస్థాయిని తగ్గిస్తాయని అన్నారు వివేక్. వందలాది చిత్రాల్లో నటించిన వివేక్ ని భారతప్రభుత్వం 2009లో పద్మశ్రీతో గౌరవించింది.  టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్‌  చేసిన సంగతి తెలిసిందే. 

click me!