ఎకానమీ క్లాస్ లో స్టార్ హీరో..!

Published : Apr 23, 2019, 12:38 PM IST
ఎకానమీ క్లాస్ లో స్టార్ హీరో..!

సారాంశం

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడానికే ఆసక్తి చూపుతుంటారు. 

సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కువగా బిజినెస్ క్లాస్ లో ప్రయాణించడానికే ఆసక్తి చూపుతుంటారు. ఇక స్టార్ హీరోలు, హీరోయిన్లు అయితే ఎకానమీ జోలికి కూడా వెళ్లరు. అభిమానుల్లో వారికుండే క్రేజ్ కారణంగా ఎకానమీ క్లాస్ లో ప్రయాణిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని బిజినెస్ క్లాస్ లోనే ప్రయాణం చేస్తుంటారు.

అయితే బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మాత్రం సాధారణ ప్రయాణికుడిగా ఎకానమీ క్లాస్ కి కనిపించేసరికి అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన మాత్రం సింపుల్ గా నవ్వుతూ విండో సీట్ లో కూర్చున్నారు.

ఈ సందర్భంగా కొందరు అభిమానులు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఆమిర్ అభిమానులు రియల్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆమిర్ సింప్లిసిటీని పొగుడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ హీరో 'లాల్ సింగ్ చద్దా' అనే సినిమాలో నటిస్తున్నారు.   

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?