రీనా దత్తాని పెళ్లి చేసుకుని తప్పు చేశా, పెద్ద షాకిచ్చిన అమీర్‌ ఖాన్‌.. గౌరీతో పెళ్లిపై క్లారిటీ

Published : Jun 02, 2025, 03:51 PM IST
aamir khan

సారాంశం

రీనా దత్తాతో పెళ్లి తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని అమీర్ ఖాన్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అందరిని షాక్‌కి గురి చేస్తున్నాయి. 

 పెళ్లి జీవితం గురించి అమీర్‌ ఖాన్ షాకింగ్‌ కామెంట్స్‌

'మహాభారతం' తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్లు అమీర్‌ ఖాన్ ఇటీవలే చెప్పి షాకిచ్చారు. ఫ్యాన్స్ అందరిని కలవరానికి గురి చేశారు. ఇదే సమయంలో మరో ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి షాకింగ్‌ కామెంట్‌ చేశారు. 

పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. `రాజ్ షమ్ని` పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ చాలా విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో తన మొదటి భార్య రీనా దత్తాతో పెళ్లి తొందరపాటు నిర్ణయం అని చెప్పారు. అది తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఆయన అన్నారు. 

కేవలం నాలుగు నెలల పరిచయంతోనే పెళ్లి చేసుకున్నామని, ఇప్పుడు ఆలోచిస్తే ఆ నిర్ణయం తప్పు అనిపిస్తుందని చెప్పారు. 39 ఏళ్ల క్రితం తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పుడు ఊహించుకోలేనని తెలిపారు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. 

చాలా తప్పులు చేశాను - అమీర్ ఖాన్

అమీర్‌ ఖాన్ ప్రస్తుతం  ‘సీతారే జమీన్ పర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. 

తన జీవితంలో చేసిన పెద్ద తప్పు ఏమిటని అడిగినప్పుడు, "చాలా తప్పులు చేశాను, కానీ ఆ తప్పుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నా సక్సెస్‌ వల్ల కాదు, నా తప్పుల కారణంగానే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను` అని వెల్లడించారు అమీర్.  

21 ఏళ్లకే రీనాతో అమీర్‌ ఖాన్‌ పెళ్లి 

రీనా, నేను చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాం. నాకు 21 ఏళ్లు, ఆమెకు 18-19 ఏళ్లు. ఏప్రిల్ 18న మా పెళ్లి జరిగింది. అంతకు ముందు కేవలం నాలుగు నెలలు మాత్రమే మేం ఒకరికొకరం తెలుసు. ఆ నాలుగు నెలల్లో కూడా ఎక్కువ సమయం కలిసి గడపలేదు.

 కానీ మా మధ్య చాలా ప్రేమ ఉండేది, అందుకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆలోచిస్తే, పెళ్లి లాంటి ముఖ్యమైన నిర్ణయం ఆలోచించి తీసుకోవాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరినైనా కలిసి నాలుగు నెలల్లో పెళ్లి చేసుకుంటానా? లేదు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వ్యక్తిని ఇంత తొందరగా ఎలా నిర్ణయించుకోగలను?" అని అమీర్‌ చెప్పారు. 

గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ గురించి ఓపెనైన అమీర్‌

గౌరీ స్ప్రాట్‌ ని అనుకోకుండా కలిశానని, స్నేహితులుగా మొదలై ప్రేమగా మారిందని అమీర్ చెప్పారు. గౌరీని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, తన ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి సంబంధాలు ఉన్నాయని, వారిని గౌరవిస్తానని ఆయన అన్నారు. ఈ లెక్కన గౌరీతో అమీర్‌ సహజీవనం చేయబోతున్నాడని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi: బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన హీరో, అతడికి కొడుకు పుట్టగానే జాతకం చెప్పిన చిరంజీవి
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..