ఒకే సినిమాలో 45 పాత్రలు.. గిన్నిస్ రికార్డ్ క్రియేట్‌ చేసిన నటుడు ఎవరో తెలుసా?

Published : Jun 02, 2025, 03:28 PM ISTUpdated : Jun 02, 2025, 03:29 PM IST
Johnson George

సారాంశం

ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డ్ సృష్టించిన దక్షిణ భారత నటుడి గురించి ఇందులో తెలుసుకుందాం. 

10 పాత్రల్లో కమల్ హాసన్

 ఒకే సినిమాలో ఒక నటుడు అనేక పాత్రలు పోషించడం చాలా అరుదు. డ్యూయల్ రోల్ చేయడమే కష్టం. కానీ కొంతమంది నటులు రెండు కంటే ఎక్కువ పాత్రలు కూడా పోషించి ఆకట్టుకున్నారు. 

ముఖ్యంగా కమల్ హాసన్ 'దశావతారం' సినిమాలో 10 పాత్రలు పోషించారు. దానికి ముందు 'మైఖేల్ మదన కామరాజన్' లో నాలుగు పాత్రలు పోషించారు.

కమల్ ని దాటిన మలయాళ నటుడు

'దశావతారం' లో కమల్ హాసన్ పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. బలరాం నాయుడు, పంజాబీ గాయకుడు, ఆంగ్లేయుడు, వృద్ధురాలు.. ఇలా పది విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్నారు. 

ఇప్పుడు ఆయన్ని దాటి, 45 పాత్రలు పోషించి గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు మలయాళ నటుడు జాన్ జార్జ్.  ఆయన 'ఆరాణు ఎన్జన్‌' సినిమాలో ఈ ఘనత సాధించారు.

45 పాత్రల్లో జాన్సన్ జార్జ్ రికార్డు

`ఆరాణు ఎన్జన్‌` సినిమా 2018 మార్చి 9న విడుదలైంది. దీనికి వి.ఆర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. విడుదలైనప్పుడు ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లభించలేదు. గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న తర్వాత ప్రేక్షకులు బాగా ఆదరించారు.

ఇందులో మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం, స్వామి వివేకానంద, డావిన్సీ, జీసస్ క్రైస్ట్ వంటి 45 పాత్రల్లో జాన్సన్ జార్జ్ నటించారు. ప్రతి పాత్రలోనూ వేరియేషన్‌ చూపించి అదరగొట్టాడు.

'ఆరాణు ఎన్జన్‌' సినిమా కథేంటి?

గ్లోబ్ మ్యాన్ అనే వ్యక్తి గురించి చెప్పే కథ ఇది. తన గుర్తింపు ఏంటో తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం తిరిగే పాత్ర ఇందులో హీరోది. ప్రతి పాత్ర ద్వారా, 'నేనెవరు? నా నిజమైన గుర్తింపు ఏమిటి?' అనే ప్రశ్నను లేవనెత్తుతుంది.

కొత్త అనుభూతినిచ్చే 'ఆరాణు ఎన్జన్‌`

గిన్నిస్ రికార్డ్ తర్వాత జాన్సన్ జార్జ్ కి సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన సాధించిన రికార్డును ఇప్పటివరకు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. 

మీరు కొత్తగా,  ఒక సినిమా చూడాలనుకుంటే ‘ఆరాణుఎన్జన్‌’ మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది. సినిమా నిడివి 1 గంట 47 నిమిషాలు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు