అమలాపాల్ 'ఆమె' చిత్రానికి షాక్.. షోలు రద్దు.. కారణం ఇదే!

Published : Jul 19, 2019, 01:20 PM IST
అమలాపాల్ 'ఆమె' చిత్రానికి షాక్.. షోలు రద్దు.. కారణం ఇదే!

సారాంశం

అమలాపాల్ నటించిన ఆమె చిత్రం మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటోంది. అమలాపాల్ ఈ చిత్రంలో బోల్డ్ గా నటించింది.

అమలాపాల్ నటించిన ఆమె చిత్రం మొదటినుంచి వివాదాల్లో చిక్కుకుంటోంది. అమలాపాల్ ఈ చిత్రంలో బోల్డ్ గా నటించింది. ప్రచార చిత్రాల్లో నగ్నంగా కనిపించి అందరిని షాక్ కి గురిచేసింది. అమలాపాల్ ఇలా బోల్డ్ గా నటించడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. 

కథ డిమాండ్ చేస్తే ఇలాంటి చిత్రాల్లో నటించడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమలాపాల్ ప్రకటించేసింది కూడా. ఆమె చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్ర మార్నింగ్ షోలు రెండు తెలుగురాష్ట్రాల్లో రద్దయ్యాయి. 

దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ఈ చిత్రానికి ఉన్న వివాదాలు ఓ కారణం అని కొందరు అంటుండగా.. ఆర్థిక పరమైన సమస్యల వల్ల విడుదల కాలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. తెలుగు వర్షన్ థియేట్రికల్ హక్కులని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి సొంతం చేసుకున్నారు. ఇక ఈ చిత్ర తెలుగు వర్షన్ నేడు రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా నెలకొని ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్