
తన కుమారుడు నాగ చైతన్య...ఓటిటి ప్రయాణం మొదలెట్టడం నాగార్జునకు ప్రేరణ ఇచ్చినట్లుంది. ఆయన తాజా చిత్రం బంగార్రాజు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. సంక్రాంతికి విడుదలైన ఆ చిత్రం నాగార్జున కెరీర్ కు బూస్ట్ ఇచ్చినట్లైంది. ఆ ఊపులోనే ఆయన ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. తన దగ్గరకు వస్తున్న సినిమాలు అనుకున్నంతగా సంతృప్తి పరచడం లేదని, అందుకే నాగ్ ఓటీటీవైపు చూపు తిప్పాడని టాక్ నడుస్తోంది.
దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం దాదాపు 80 శాతం మంది థియేటర్లలో కన్నా ఓటీటిలలో నే సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అందుకే నాగ్ ఓటీటీలో ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాడట. ఇందులో భాగంగానే ఓ వెబ్ సిరీస్ చేసేందుకు నాగ్ ఓకే చెప్పాడట. డిస్నీ+ హాట్ స్టార్ ఓ వెబ్ సిరీస్‌లో హీరో పాత్ర కోసం నాగ్‌ను సంప్రదించిందని, అందుకు నాగ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని టాక్ నడుస్తోంది. ఓ కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తుంది.
ఇప్పటికే సమంత, తమన్నా, కాజల్, నిత్యా మీనన్ సహా చాలా మంది స్టార్ హీరోయిన్లు ఓటిటి వేదిక ఎక్కేసారు. మరోవైపు బాలయ్య వంటి స్టార్ హీరోలు కూడా తక్కువేమీ తినలేదు. వాళ్లు కూడా వరుసగా ఆన్లైన్ ప్లాట్ ఫాంలో కనిపిస్తున్నారు. వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. నెట్ ఫ్లెక్స్ కోసం ఓ హాలీవుడ్ సిరీస్ ఆధారంగా వీళ్ళు ఇక్కడ క్రైమ్ డ్రామాలో కలిసి నటిస్తున్నారు. మరోవైపు దూత పేరుతో నాగ చైతన్య కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఒక వెబ్ సిరీస్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.